ఎలా వెళ్లిందో గానీ..మ‌ల‌ద్వారంలో వెళ్లింది ఆరు అంగుళాల పొడ‌వున్న పీవీసీ ష‌వ‌ర్ పైప్‌!

ఎలా వెళ్లిందో స‌రిగ్గా చెప్ప‌ట్లేదు గానీ.. ఆరు అంగుళాల పొడ‌వు మేర ఉన్న ఓ పీవీసీ ఫ‌వ‌ర్ పైప్ ఆ వ్య‌క్తి మ‌ల ద్వారంలో వెళ్లింది. మ‌ల‌ద్వారంలో ఇరుక్కున్న ఆ ష‌వ‌ర్ పైప్‌ను తొల‌గించ‌డానికి డాక్ట‌ర్లు సుమారు నాలుగు గంట‌ల పాటు శ్ర‌మించాల్సి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది ఢిల్లీలోనే.

ఆ వ్య‌క్తి పేరు, ఇత‌ర వివ‌రాల‌ను డాక్ట‌ర్లు గానీ, ఆసుప‌త్రి సిబ్బంది గానీ వెల్ల‌డించ‌ట్లేదు. బాత్‌రూమ్‌లో కాలు జారి కింద‌ప‌డ‌టం వ‌ల్ల ఆ పీవీసీ పైప్ త‌న మ‌ల‌ద్వారంలో ఇరుక్కుంద‌ని బాధిత వ్య‌క్తి త‌మకు వివ‌రించిన‌ట్లు ముంబై రామ్‌మ‌నోహ‌ర్ లోహియా ఆసుప‌త్రి డాక్ట‌ర్ పీయూష్ కుమార్ చెబుతున్నారు.

ఆరు అంగుళాల పొడ‌వు మేర ఈ పైప్ మ‌ల‌ద్వారంలో ఇరుక్కుంద‌ని అన్నారు. ఆరు అంగుళాల మేర లోనికి వెళ్లిన‌ప్ప‌టికీ.. అంత‌ర్గ‌తంగా ఎలాంటి ప్ర‌మాదం క‌లిగించ‌క‌పోవ‌డం ఆ వ్య‌క్తి అదృష్ట‌మ‌ని చెప్పారు. శ‌స్త్ర చికిత్స చేసిన 48 గంట‌ల త‌రువాత ఆ వ్య‌క్తిని ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి చేశామ‌ని అన్నారు. బాధితుడి విజ్ఞ‌ప్తి మేర‌కు అత‌ని వివ‌రాల‌ను వెల్ల‌డించ‌ట్లేద‌ని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here