మృత‌దేహాన్ని మార్చురీకి త‌ర‌లించారు! పోస్ట్‌మార్ట‌మ్ టేబుల్‌పై క‌ద‌లిక‌! క్ష‌ణంలో పుర్రె లేచిపోయేదే!

భోపాల్‌: చ‌నిపోయాడని నిర్ధారించిన వ్య‌క్తి చివ‌రి నిమిషంలో లేచి కూర్చ‌న్న సంఘ‌ట‌న‌లను మ‌నం చాలానే చూశాం. వాట‌న్నిటికంటే భిన్న‌మైన‌ది ఈ సంద‌ర్భం. ఓ వ్య‌క్తి మ‌ర‌ణించాడ‌ని డాక్ట‌ర్లు నిర్ధారించ‌డంతో.. అత‌ణ్ణి మార్చురీకి త‌ర‌లించారు.

కొన్ని గంట‌ల పాటు అక్క‌డే ఉంచారు. ఇక‌- పోస్ట్‌మార్ట‌మ్ చేయ‌డానికి రెడీ అవ్వాల్సి ఉంది. మృత‌దేహాన్ని పోస్ట్‌మార్ట‌మ్ చేసే టేబుల్‌పైకి తీసుకొచ్చారు. చేతుల‌కు గ్లౌజ్ వేసుకున్న పాథాల‌జిస్ట్‌.. మృత‌దేహాన్ని ముక్క‌లు చేయ‌డానికి రెడీ అయ్యాడు.

నిజంగా అద్భుత‌మే జ‌రిగింద‌క్క‌డ‌. ఆ వ్య‌క్తి మృత‌దేహంలో క‌ద‌లిక‌లు చోటు చేసుకున్నాయి. అత‌ని నాడీని ప‌రిశీలించ‌గా.. అది కొట్టుకుంటున్న‌ట్టు గుర్తించారు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఛింద్వారాలో చోటు చేసుకుంది. ఆ వ్య‌క్తి పేరు హిమాన్షు భరద్వాజ్. ఓ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఛింద్వారాలోని ఆసుపత్రికి, ఆ త‌రువాత నాగ్‌పూర్‌కు త‌ర‌లించారు. అతను బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు చెప్పారు. మళ్లీ ఛింద్వారాకు తీసుకొచ్చారు.

ప్ర‌భుత్వ జిల్లా ఆసుపత్రిలో చూపించారు కుటుంబ స‌భ్యులు. హిమాన్షు చనిపోయినట్లు నిర్ధారించారు. దీనితో మృత‌దేహాన్ని మార్చురీకి త‌ర‌లించారు. కొన్ని గంట‌ల‌పాటు అక్క‌డే ఉంచారు. తీరా.. పోస్ట్‌మార్టమ్ నిర్వహించడానికి ముందు పాథాలజిస్ట్ నాడిని ఆడుతున్న‌ట్టు గుర్తించాడు.

వెంటనే అతన్ని తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స అందించారు. బ్రెయిన్‌డెడ్‌గానే ఉన్నప్పటికీ అతన్ని మ‌ళ్లీ నాగ్‌పూర్‌కు తీసుకెళ్లారు. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల్లో ఒక్కోసారి కొద్దిసేపు శ్వాస ఆగిపోతుంటుందని, హిమాన్షు విషయంలో అదే జరిగిందని ఆయన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here