పిచ్చి కుక్క.. మామూలుగా కొర‌క‌లేదుగా!

ఢిల్లీ ఉత్త‌మ్‌న‌గ‌ర్‌లో ఓ పిచ్చికుక్క బీభ‌త్సం సృష్టించింది. ఎవ‌రు క‌నిపిస్తే వారి వెంట ప‌డింది. ప్ర‌త్యేకించి- పిల్ల‌ల‌ను. పిల్ల‌ల‌ను వ‌ద‌ల్లేదు. మీద ప‌డి కొరికి ప‌డేసింది. దాని దెబ్బ‌కు ముగ్గురు గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ వారిలో ఓ బాలుడు ఉన్నాడు. అత‌ణ్ని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

దేశ రాజ‌ధాని ఉత్త‌మ్‌న‌గ‌ర్‌లో కింద‌టి నెల 28వ తేదీన చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇది. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ సోమ‌వారం వెలుగులోకి వ‌చ్చింది. పిట్‌బుల్ టెర్రియ‌ర్ జాతికి చెందిన కుక్క అది.

ఇద్ద‌రు పిల్లల‌ను వెంటాడుతూ రావ‌డం, వారిలో ఓ బాలిక త‌ప్పించుకుని పారిపోగా.. నోటికి అందిన ఓ బాలుడి మీద ప‌డి కొరికేయ‌డం ఈ వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. కింద‌ప‌డ్డ బాలుడ్ని ఆ కుక్క నుంచి విడిపించ‌డానికి వ‌చ్చిన మ‌హిళ‌ను కూడా అది వ‌ద‌ల్లేదు.

దాని దెబ్బ‌కు ఆ మ‌హిళ కూడా కింద‌ప‌డ‌గా, ఆమె మీద కూడా కుక్క దాడి చేసింది. దీన్ని చూసిన ఇంకో మ‌హిళ క‌ర్ర పుచ్చుకుని ఎన్ని దెబ్బ‌లు కొట్టినా వ‌ద‌ల‌క‌పోవ‌డం, ఓ వ్య‌క్తి ప్లాస్టిక్ కుర్చీతో కొట్టిన త‌రువాతే అది ఆ బాలుడ్ని, మ‌హిళ‌ను వ‌ద‌ల‌డం ఇందులో క‌నిపిస్తుంది. అనంత‌రం- త‌న‌ను కుర్చీతో కొట్టిన వ్య‌క్తిని వీధి చివ‌రి వ‌ర‌కూ త‌ర‌మ‌డం మ‌నం చూడ‌వ‌చ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here