సూప్ కోసం కుక్కలు.. ఎక్కడ తినడానికి ఇస్తారో తెలుసా..?

ప్రస్తుతం వింటర్ ఒలింపిక్స్ దక్షిణ కొరియాలో జరుగుతున్నాయి. అయితే ఆ వెలుగుజిలుగుల వెనుక ఓ భయంకరమైన చెడు నిజం దాగుంది. అదేమిటంటే కుక్కలను చంపడం. వింటర్ ఒలింపిక్స్ లో భాగంగా అక్కడకు వచ్చే ఆటగాళ్లకు, ప్రేక్షకులకు కుక్కల మాంసంతో తయారు చేసిన సూప్ ను వడ్డిస్తున్నారు.

ఎక్కడి నుండో తీసుకొచ్చిన కుక్కలను బంధించి వాటిని కరెంట్ షాక్ తో చంపుతారు. ఆ తర్వాత వాటి మాంసంతో తయారు చేసిన సూప్ ను అందరికీ వడ్డిస్తున్నారు. ఎంతో మంచి మంచి జాతికి చెందిన కుక్కలను కూడా ఇక్కడ చంపుతూ ఉన్నారు. హ్యూమనే సొసైటీ ఇంటర్నేషనల్ విభాగం కుక్కలను చంపడంపై తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే ఈ బిజినెస్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.

గత కొద్ది రోజులుగా దాదాపు 1300 కుక్కలను హ్యూమనే సొసైటీ ఇంటర్నేషనల్ గ్రూప్ వారు రక్షించారు. అయితే కుక్కలను చంపుతున్న లెక్కతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. కుక్కల మాంసాన్ని విపరీతంగా ఉపయోగిస్తుంటారు దక్షిణ కొరియా వాసులు. 2.5మిలియన్ల కుక్కలు దక్షిణకొరియాలో బలి అవుతున్నాయి. పలువురు గ్రామస్థులు కూడా కుక్కలను పెంచి.. వాటిని పలు రెస్టారెంట్లకు అమ్మేస్తున్నారు. ఎన్నో కుక్కలను రక్షించాల్సి ఉందని హ్యూమనే సొసైటీ ఇంటర్నేషనల్ బృందం అంటోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here