పాకిస్థాన్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ట్రంప్.. ఇక అబద్దాలు చెప్పింది చాలు..!

తీవ్రవాదం విషయంలో పాకిస్థాన్ ఆడుతున్న డబుల్ గేమ్ ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులకు పాకిస్థాన్ కొమ్ముకాస్తోందని దాన్ని తాము తెలుసుకోకుండా మూర్ఖంగా డబ్బులు ఇచ్చామని చెప్పుకొచ్చారు. పాకిస్థాన్ పై ట్రంప్ చేసిన ట్వీట్ పాక్ ప్రభుత్వంలో గుబులు పుట్టిస్తోంది.

పాకిస్థాన్‌పై ట్రంప్ తీవ్ర‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గత 15 సంవ‌త్స‌రాల నుంచి పాకిస్థాన్‌కు త‌మ దేశం తెలివితక్కువగా నిధులు అందించింద‌ని అన్నారు. సుమారు 33 బిలియన్‌ డాలర్లకు పైగా అమెరికా ఇచ్చింద‌ని, కానీ పాక్‌ మాత్రం త‌మ దేశాన్ని మోసం చేస్తూ అస‌త్యాలు చెప్పింద‌ని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. త‌మ దేశ నేతలను పాక్ అజ్ఞానుల‌ని అనుకుంటోంద‌ని, పాక్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంగానే ఉందని, ఇక ఆ దేశ‌పు ఆటలు సాగబోవని అన్నారు.

ప్రస్తుతం ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో పాకిస్థాన్ ఉంది. ఏ పనికైనా టైమ్ లిమిట్ అన్నది ఉంటుంది. తీవ్రవాదులతో తాము పోరాడుతూ ఉన్నామని పాకిస్థాన్ కొన్ని సంవత్సరాలుగా చెబుతూనే ఉంది. కానీ ఇప్పటిదాకా చర్యలు సఫలం కాలేదు. తీవ్రవాదులకు ప్రభుత్వమే రక్షణ కల్పిస్తోంది అన్న కామెంట్లు కూడా గతంలోనే వచ్చాయి. అమెరికా కొన్ని సంవత్సరాలుగా వెతికిన ఒసామా బిన్ లాడెన్ కూడా పాక్ లో దాక్కొన్న సంగతి అందరికీ తెలిసిందే..! పాకిస్థాన్ తీవ్రవాదులకు సహాయం చేస్తోంది అన్న దానికి ఇంతకంటే సాక్ష్యం ఏదీ లేదేమో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here