మొసలి కాలును విరిచేసింది.. సింహాలు ప్రాణాలు తీసేశాయి.. అయ్యో జిరాఫీ..!

నీళ్లు తాగడానికి జిరాఫీ ఓ నీటి కొలను దగ్గరకు వెళ్ళింది. అలా వెళ్ళినప్పుడు ఓ మొసలి అమాంతం నీటి లోపలి నుండి బయటకు వచ్చి ఆ జిరాఫీ కాలును నోట కరచుకుంది. కొన్ని గంటల పాటూ ఆ మొసలి నుండి తన కాలును విడిపించుకోవడానికి ఆ జిరాఫీ ప్రయత్నించింది. చాలాసేపటి తర్వాత జిరాఫీ కాలును మొసలి వదిలిపెట్టింది. కానీ మొసలి కొరకడం వలన కాలులో గాయం ఏర్పడడంతో అది అక్కడి నుండి కదలలేకపోయింది. ఈ ఘటన సౌత్ ఆఫ్రికాలోని లోవర్ సెబీ దగ్గర చోటుచేసుకుంది.

అలా కదలలేకపోయిన జిరాఫీ కి పక్కనే మరో అపాయం ముంచుకు వచ్చింది. కొన్ని గంటల పాటూ అక్కడే ఇసుకలో పడిపోయిన జిరాఫీ వద్దకు సింహాల గుంపు వచ్చింది. అప్పటికే గాయపడిన జిరాఫీని చంపేయడానికి అంత సమయం కూడా పట్టలేదు ఓ శివంగికి. ఈ ఘటనను మారియో పాల్ అనే వ్యక్తి రికార్డు చేశాడు. స్థానిక ఫీల్డ్ గైడ్ అయిన మారియో.. కొందరు పర్యాటకులను సఫారీ చూపించడానికి తీసుకువెళ్ళినప్పుడు ఈ దృశ్యం కనిపించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here