మొబైల్‌ నంబ‌ర్లు: ఇక‌పై 10 కాదు..13!

న్యూఢిల్లీ: సెల్‌ఫోన్ నంబ‌ర్లెన్నుంటాయి? ఈ ప్ర‌శ్న‌కు ఠ‌క్కున దొరికే స‌మాధానం 10. ఇక‌పై అలా కుద‌ర‌దు. సెల్‌పోన్ అంకెల సంఖ్య మారిపోబోతోంది. 13 అంకెలు ఉన్న ఫోన్ నంబ‌ర్లు రాబోతున్నాయి. ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి ఇది అమ‌ల్లోకి రాబోతోంది.

 

జూలై 1వ తేదీ నుంచి జారీ చేయ‌బోయే సిమ్‌కార్డుల‌కు 13 సంఖ్య‌లు ఉన్న నంబ‌ర్లు ఉంటాయి. ఈ మేర‌కు కేంద్ర టెలిక‌మ్యూనికేష‌న్ల మంత్రిత్వ‌శాఖ ఈ నిర్ణ‌యం తీసుకుంది.

మొబైల్ టు మొబైల్ కస్టమర్లకు కొత్త సిరీస్‌లు అందుబాటులోకి వ‌స్తాయి. అవి 13 అంకెల‌తో ఉంటాయి. కొత్త‌వే కాదు.. ద‌శ‌ల‌వారీగా పాత వినియోగ‌దారుల సెల్‌ఫోన్ నంబ‌ర్ల‌ను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది.

దీనికి కూడా కేంద్ర‌ప్ర‌భుత్వం గ‌డువు విధించింది. ఈ ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీలోపు పాత కస్టమర్లంద‌రూ నంబ‌ర్‌ పోర్టబులిటీ చేసుకోవాల్సి ఉంటుంది.

డిసెంబర్ 31వ తేదీ వరకు పాత నెంబర్లు యథావిధిగా పని చేస్తాయి. ఆ త‌రువాతే ఏంట‌నేది ఇంకా తేల‌ట్లేదు. 13 అంకెల మొబైల్ నెంబర్ సిరీస్ ఆమోదం కూడా ల‌భించింద‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here