పెట్రోల్-డీజల్ రేట్ తగ్గింది.. మరీ ఎక్కువ ఆనందపడకండి..!

గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎప్పుడు రేటు తగ్గిస్తారోనని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు. ఈరోజు ఒకవేళ ఫుల్ ట్యాంక్ కొట్టిస్తే.. రేపు రేట్లు తగ్గిస్తే ఎలా అన్న డౌట్ తో కొందరైతే తక్కువ డబ్బులకే పెట్రోల్-డీజల్ కొట్టిస్తున్నారు. అయితే ఈరోజు కాస్త పెట్రోల్-డీజల్ రేట్లు కాస్త తగ్గాయి. అలాగని ఎక్కువగా ఆనందపడిపోకండి.. ఎప్పటిలాగే రూపాయల్లో రేట్లు పెంచేసిన ప్రభుత్వం.. పైసల్లో రేట్లను తగ్గించారు.

ఢిల్లీలో లీటరు పెట్రోలుకు 60 పైసలు, ముంబైలో 59 పైసలు, ఢిల్లీలో డీజిల్‌పై 56 పైసలు, ముంబైలో 59 పైసలు తగ్గింది. తగ్గిన ధరల ప్రకారం.. ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ.77.83, ముంబైలో రూ.85.65, కోల్‌కతాలో రూ.80.47, చెన్నైలో రూ.80.80కి దిగొచ్చింది. ఇక ఢిల్లీలో బుధవారం లీటర్ డీజిల్ ధర రూ.68.75గా ఉండగా, ముంబైలో రూ.73.20, కోల్‌కతాలో రూ.71.30, చెన్నైలో రూ.72.58గా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here