మంచుతో గ‌డ్డ‌క‌ట్టిన న‌దిలో ప్లాస్టిక్ బ్యాగ్‌! తెరిచి చూస్తే..

మాస్కో: మ‌ంచుతో గ‌డ్డ‌క‌ట్టుకుపోయిన న‌దిలో డ‌జ‌న్ల కొద్దీ మాన‌వ అర‌చేతులు క‌నిపించిన ఉదంతం ఇది. ర‌ష్యాలోని ఖ‌బ‌రోవ్‌స్క్ న‌గ‌రం స‌మీపంలో ప్ర‌వ‌హించే ఓ న‌దిలో, ప్లాస్టిక్ క‌వ‌ర్‌లో అవి క‌నిపించాయి. ఆ బ్యాగ్‌ను తెరిచి చూసిన స్థానికులు మాన‌వ అర‌చేతులు ఉండ‌టంతో భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌య్యారు.

స్థానిక పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. స‌మాచారం అందుకున్న వెంట‌నే సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు ఆ ప్లాస్టిక్ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో మొత్తం 54 మాన‌వ అర చేతులు ఉన్నాయి. మిగిలిన శ‌రీర భాగాలేవీ లేవు.

ఖ‌బ‌రోవ్‌స్క్ న‌గ‌రం అటు సైబీరియా, ఇటు చైనా స‌రిహ‌ద్దుల్లో ఉంటుంది. ఈ న‌గ‌రం గుండా అముర్ న‌ది ప్ర‌వ‌హిస్తుంటుంది. కొద్దిరోజులుగా అతి శీత‌ల వాతావ‌ర‌ణం వ‌ల్ల న‌ది గ‌డ్డ‌క‌ట్టుకుపోయింది.

 

న‌దిలో పేరుకు మంచులో ఈ ప్లాస్టిక్ బ్యాగ్ ల‌భించిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు. శీత‌ల ప్రాంతం కావ‌డం వ‌ల్ల అవి చెడిపోకుండా ఉన్నాయి. అవి ఎవ‌రివో, ఎప్ప‌టివో తెలుసుకోవ‌డానికి పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ అరచేతుల‌ను ఫోరెన్సిక్ ప‌రీక్ష‌ల కోసం పంపించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here