త‌ల‌కింద చేతులు పెట్టుకుని హాయిగా నిద్రిస్తున్న ఆ వ్య‌క్తి ఎన్నో అంత‌స్తు చివ‌ర్లో ఉన్నాడంటే!

బీజింగ్‌: మొండివాడు రాజుకంటే బ‌ల‌వంతుడ‌ని అంటుంటారు. తాగినోడికీ వ‌ర్తిస్తుందేమో ఈ సూత్రం. మ‌ద్యం తాగినోడికి క‌న్ను, మిన్నూ కాన‌దన‌డానికి అచ్చ‌మైన ఉదాహ‌ర‌ణ ఈ ఘ‌ట‌న‌. ఫుల్లుగా మ‌ద్యం తాగిన ఓ వ్య‌క్తి ఏకంగా.. 29వ అంత‌స్తు పిట్ట‌గోడ‌పైకెక్కి నిద్ర‌పోయాడు. ఎందుక‌లా అని అడిగితే- ఇక్క‌డి నుంచి దూకి చ‌ద్దామ‌ని అంటూ దిమ్మ‌తిరిగిపోయే స‌మాధానం ఇచ్చాడు.

 

చైనాలోని షాంగ్జీ ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న దీనికి సంబంధించిన క‌థ‌నాన్ని చైనాకు చెందిన హెచ్ఎస్‌డ‌బ్ల్యూ.సీఎన్ అనే వెబ్‌సైట్ ప్ర‌చురించింది. షాంగ్జీ ప్రావిన్స్‌లోని గ్జియాన్ సిటీలో 29వ అంత‌స్తు పిట్ట‌గోడ మీద ఓ వ్య‌క్తి నిద్రించిన‌ట్టు స్థానిక పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందింది. హుటాహుటిన వారు సంఘ‌ట‌నాస్థలానికి చేరుకుని, త‌ల‌పైకెత్తి చూసి ఆశ్చ‌ర్యపోయారు. పిట్ట‌గోడ అంచుల మీద నిద్రిస్తూ క‌నిపించాడా వ్య‌క్తి.

 

ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి వ‌చ్చి ఉంటాడ‌ని పోలీసులు అనుమానించారు. ఏ మాత్రం అనుమానం రాకుండా 29వ అంత‌స్తు పైకి చేరుకుని, అత‌ణ్ని సుర‌క్షితంగా ప‌ట్టుకున్నారు. అలా ఎందుకు నిద్రించావ‌ని ప్ర‌శ్నిస్తే.. ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి వ‌చ్చాన‌ని స‌మాధానం ఇచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here