`మీరు చెప్పిన‌ట్టు విన‌డానికి సెక్స్ వ‌ర్క‌ర్ అని అనుకుంటున్నారా? `విమానం ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌!

సెల‌వుల‌ను ఎంజాయ్ చేయ‌డానికి సైప్ర‌స్‌కు బ‌య‌లుదేరారు న‌లుగురు విద్యార్థినులు. మాంఛెస్ట‌ర్‌లో విమానం ఎక్కారు. ఈజీ జెట్ సంస్థ‌కు చెందిన ఈజెడ్‌వై 1975 విమానం అది. మాంఛెస్ట‌ర్ నుంచి సైప్ర‌స్‌లోని ప్యాఫోస్‌కు వెళ్లాల్సి ఉందా విమానం. సుమారు 182 మందితో విమానం బ‌య‌లుదేరింది.

విమానం గాల్లో ఉన్న స‌మ‌యంలో ఆ విద్యార్థినులు ఎయిర్ హోస్టెస్‌కు చెప్పి, ఓ ఫుల్ బాటిల్ తెప్పించుకున్నారు. దాన్ని ఖాళీ చేశారు. క‌డుపులో ప‌డ్డ అల్క‌హాల్ కిక్ ఇవ్వ‌డం మొద‌లు పెట్టింది. ఇక గమ్మున ఉండ‌లేదా లేడీస్ బ్యాచ్‌. గ‌ట్టి, గ‌ట్టిగా అర‌వ‌డం మొద‌లు పెట్టారు. కేక‌లు వేయ‌డం ఆరంభించారు. గ‌ట్టిగా మాట్లాడుకోసాగారు.

సుమారు గంట గ‌డిచిన‌ప్ప‌టికీ.. వారి గ‌లాభా త‌గ్గ‌లేదు. దీనితో తోటి ప్ర‌యాణికులు వారిని అడ్డుకోవ‌డంతో విమానం మొత్తం ర‌చ్చ‌, ర‌చ్చే అయిపోయింది. తోటి ప్ర‌యాణికుల కంటే గ‌ట్టిగా నోరేసుకున్నారా విద్యార్థినులు. బూతులు మాట్లాడారు. మీరు చెప్పిన‌ట్టు విన‌డానికి తామేమీ సెక్స్ వ‌ర్క‌ర్లం కాదంటూ రంకెలేశారు. ఎంత చెప్పినా వినిపించుకోలేదు.

దీనితో విమానాన్ని మార్గ‌మ‌ధ్య‌లో గ్రీస్‌లోని ఏథెన్స్‌లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ విద్యార్థినుల‌ను విమానం నుంచి కిందికి దించేశారు. ఈ విష‌యాన్ని ఈజీజెట్ విమాన‌యాన సంస్థ ధృవీక‌రించింది. కూడా విమానంలో గొడ‌వ చేయ‌డం వ‌ల్ల న‌లుగురు విద్యార్థినుల‌ను ఏథెన్స్‌లో దించేయాల్సి వ‌చ్చింద‌ని వెల్ల‌డించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here