ఢిల్లీ వ‌ర్శిటీ విద్యార్థి హ‌త్య వెనుక‌..`మేల్ టు మేల్ డేటింగ్ యాప్‌`.. హోమో సెక్సువ‌ల్‌ కార‌ణం!

న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివ‌ర్శిటీ విద్యార్థి ఆయుష్ నౌటియాల్ దారుణ హ‌త్య వెనుక కొత్త కోణం వెలుగులోకి వ‌చ్చింది. మేల్ టు మేల్ డేటింగే దీనికి కార‌ణ‌మ‌ని పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది. మేల్ డేటింగ్ యాప్ ద్వారా ప‌రిచ‌యమైన ఇస్తియాఖ్ అనే యువ‌కుడు ఈ హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్టు తేలింది. పోలీసులు అత‌ణ్ని అరెస్టు చేశారు.

నిందితుడు త‌న నేరాన్ని అంగీక‌రించాడు కూడా. ఢిల్లీ యూనివ‌ర్శిటీకి అనుబంధంగా ప‌నిచేస్తోన్న రామ్ లాల్ ఆనంద్ క‌ళాశాల విద్యార్థి ఆయుష్ నౌటియాల్. మేల్ డేటింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న ఆయుష్‌.. త‌ర‌చూ ఆ యాప్ ద్వారా కొత్త వారిని ప‌రిచ‌యం చేసుకునే వాడు.

ఈ నేప‌థ్యంలోనే.. ఆయుష్‌కు ఇస్తియాఖ్ అనే 25 సంవ‌త్స‌రాల యువ‌కుడు ప‌రిచ‌యం అయ్యాడు. అత‌నితో ఆయుష్ స‌న్నిహితంగా ఉండేవాడు. ఆయుష్‌ది డ‌బ్బున్న కుటంబం కావ‌డంతో అత‌ణ్ని కిడ్నాప్ చేయాల‌ని ఇస్తియాఖ్ కుట్ర ప‌న్నాడు. అత‌ణ్ని కిడ్నాప్ చేశాడు. ఈ నెల 21వ తేదీన కాలేజీకి వెళ్లిన ఆయుష్ సాయంత్రమైన‌ప్ప‌టికీ.. ఇంటికి చేర‌లేదు.

అదే స‌మ‌యంలో అత‌ని త‌ల్లిదండ్రుల‌కు వాట్స‌ప్ మెసేజ్ అందింది. ఆయుష్‌ను కిడ్నాప్ చేశాన‌ని, 50 ల‌క్ష‌ల రూపాయ‌లు ఇవ్వాల‌నేది ఆ మెసేజ్ సారాంశం. త‌ల‌కు బ్యాండేజీ చుట్టి ఉన్న ఆయుష్ ఫొటోను కూడా వాట్స‌ప్‌లో షేర్ చేశాడు.

తాము డ‌బ్బులు ఇవ్వ‌డానికి సిద్ధ‌మ‌ని, ఎక్క‌డికి రావాలో చెప్పాల‌ని కోర‌గా.. ద్వార‌క ప్రాంతంలోని డ్రైనేజీ పైప్‌ల వ‌ద్ద‌కు రావాల‌ని ఇస్తియాఖ్ స‌మాచారం ఇచ్చాడు. ఈ నెల 22వ తేదీన ఆయుష్ త‌ల్లిదండ్రులు డ‌బ్బులు తీసుకుని అక్క‌డికి వెళ్ల‌గా.. ఆయుష్ మృత‌దేహం క‌నిపించింది.

దీనిపై వారు పాలం విలేజ్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు చేప‌ట్టిన ద‌ర్యాప్తులో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆయుష్‌కు మేల్ డేటింగ్ యాప్ ద్వారా ఇస్తియాఖ్ ప‌రిచ‌యం అయ్యాడని, ప‌రిచ‌యమైన 10 రోజుల్లో, మూడుసార్లు వాళ్లు క‌లిశార‌ని ద‌ర్యాప్తులో తేలింది.

హ‌త్య‌కు ముందు కూడా ఆయుష్‌, ఇస్తియాఖ్ ఓ రెస్టారెంట్‌లో క‌లిశార‌ని స్ప‌ష్ట‌మైంది. ఆ రెస్టారెంట్‌లో ల‌భించిన సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు ఇస్తియాఖ్‌ను అరెస్టు చేశారు. అత‌ను త‌న నేరాన్ని అంగీక‌రించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here