కుటుంబ స‌భ్యుల‌కు శ్రీ‌దేవి పార్థివ‌దేహం అప్ప‌గింత‌! రాత్రిక‌ల్లా ప్ర‌త్యేక విమానంలో ముంబైకి!

ముంబై: శ్రీ‌దేవి పార్థివ దేహాన్ని దుబాయ్ పోలీసులు ఆమె కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు. ఎంబాల్మింగ్ పూర్తి చేసిన త‌రువాత ఆమె పార్థివ దేహాన్ని భ‌ర్త బోనీక‌పూర్‌కు అంద‌జేశారు.

ఆ స‌మ‌యంలో బోనీక‌పూర్ మొద‌టి భార్య మోనా కుమారుడు, బాలీవుడ్ న‌టుడు అర్జున్‌క‌పూర్ అక్క‌డే ఉన్నారు. దీనికి సంబంధించిన న్యాయ‌ప‌ర‌మైన ప్ర‌క్రియ‌ను దుబాయ్ పోలీసులు పూర్తి చేశారు.

కొన్ని ద‌ర‌ఖాస్తుల‌ను కూడా బోనీక‌పూర్‌కు ఇచ్చారు. దీనితో రాత్రికల్లా శ్రీ‌దేవి పార్థివ‌దేహం ముంబై చేరుకోనుంది. దీనితో రాత్రికల్లా శ్రీ‌దేవి పార్థివ‌దేహం ముంబై చేరుకోనుంది. విమానాశ్ర‌యం నుంచి నేరుగా అంధేరి లోఖండ్‌వాలా ప్రాంతంలోని ఇంటికి త‌ర‌లిస్తారు. పారిశ్రామిక‌వేత్త అనిల్ అంబాని సొంత ఎయిర్‌క్రాఫ్ట్‌లో పార్థివ‌దేహాన్ని తీసుకుని రానున్నారు.

అభిమానుల చివ‌రి చూపు కోసం ఎక్కువ రోజులపాటు శ్రీ‌దేవి మృత‌దేహాన్ని ఉంచుతారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. శ్రీ‌దేవి మ‌ర‌ణించి ఇప్ప‌టికే 65 గంట‌ల‌కు పైగా గ‌డిచింది.

పైగా- పోస్ట్‌మార్ట‌మ్ నిర్వ‌హించ‌డం, ఎంబాల్మింగ్ చేయ‌డం వంటి ప్ర‌క్రియ‌లు చోటు చేసుకున్నాయి. ఈ క్ర‌మంలో ఎక్కువ స‌మ‌యం శ్రీ‌దేవి పార్థివ‌దేహాన్ని అభిమానుల సంద‌ర్శ‌న కోసం ఉంచ‌క‌పోవ‌చ్చ‌ని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here