ఎమిరేట్స్ ఉద్యోగుల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించిన స‌ర్కార్‌! భారీగా బోన‌స్

అబుధాబి: ప్ర‌భుత్వ ఉద్యోగుల‌పై యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ ప్ర‌భుత్వం మ‌రోసారి వ‌రాలజ‌ల్లు కురిపించింది. ప్ర‌భుత్వ ఉద్యోగులంద‌రికీ భారీగా బోన‌స్ ప్ర‌క‌టించింది. ఒక్కొక్క‌రికి 5000 నుంచి 50000 దిర్హామ్‌ల‌ను బోన‌స్‌గా ప్ర‌క‌టించింది అక్క‌డి ప్ర‌భుత్వం. ఈ మేర‌కు ఆదేశాల‌ను కూడా జారీ చేసింది.

ఇయ‌ర్ ఆఫ్ జ‌యేద్‌, త్వ‌ర‌లో ఈదుల్ ఫిత‌ర్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ బోన‌స్‌ను ప్ర‌క‌టించిన‌ట్లు ఎమిరేట్స్ అధ్య‌క్షుడు షేక్ ఖ‌లీఫా బిన్ జ‌యేద్ అల్ న‌హ్యాన్, ఉపాధ్య‌క్షుడు షేక్ మ‌హ్మ‌ద్ ర‌షీద్ అల్ మ‌ఖ్తౌమ్‌, దుబాయ్ రూల‌ర్ షేక్ హ‌మ‌ద‌న్ బిన్ ర‌షీద్ అల్ మ‌ఖ్తౌమ్ వెల్ల‌డించారు. ఈదుల్ ఫిత‌ర్‌కు ముందే ప్ర‌భుత్వ ఉద్యోగులంద‌రికీ ఈ మొత్తం అందుతుంద‌ని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here