శ్రీదేవి కేసు క్లోజ్ చేసేశామని చెప్పిన దుబాయ్ పోలీసులు.. మన వాళ్ళదే అంతా ఓవర్ యాక్షన్..!

శ్రీదేవి కేసును క్లోజ్ చేశామని దుబాయ్ పోలీసులు స్పష్టం చేశారు. ఆమె యాక్సిడెంటల్ గా నీటిలో మునిగి మరణించిందని అంతకు మించి మరేమీ లేదని దుబాయ్ పోలీసులు ట్వీట్ చేశారు. వారు ప్రాథమిక విచారణ చేస్తున్నప్పుడు వెలువడిన ఒకే ఒక్క వార్తను పట్టుకొని భారత్ లోని పలు మీడియా సంస్థలు చాలా ఓవర్ యాక్షన్ చేశాయి. ఉన్నవీ.. లేనివి కథనాలు వండాయి. తమకు ఎవరి మీద అనుమానాలు లేవని.. శ్రీదేవి మృతికి సంబంధించిన కేసును క్లోజ్ చేశామని దుబాయ్ పోలీసులు తమ సోషల్ మీడియా ఖాతాలలో వెల్లడించారు.

శ్రీదేవి భౌతికకాయాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇందుకు సంబంధించి ప్రాసిక్యూషన్ అధికారులు క్లియరెన్స్ లేఖ ఇచ్చారు. ఆమెను అక్కడి నుంచి కాసేపట్లో ముంబయికి తరలించనున్నారు. ప్రస్తుతం శ్రీదేవి భౌతిక కాయానికి రసాయన ప్రక్రియ పూర్తి చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here