శ్రీదేవి మృతదేహం ఈరోజు కూడా భారత్ కు రాదా.. ఇంకా విచారణ చేయాలని తేల్చిన దుబాయ్ పోలీసులు..!

శ్రీదేవి మృతిపై దుబాయ్ పోలీసులు ఇంకా విచారణ చేయాలని చెప్పారు. శ్రీదేవి శరీరంలో ఆల్కహాల్ కూడా ఉందని ఫోరెన్సిక్ రిపోర్ట్ లో తేలింది. దుబాయ్ నుండి ఈరోజు శ్రీదేవి మృతదేహం భారత్ కు చేరుకుంటుందని అందరూ భావించారు.. అయితే ఆమె మృతిపై అనుమానాలను దుబాయ్ పోలీసులు వ్యక్తం చేయడంతో ఈ రోజు ఆమె మృతదేహం భారత్ కు చేరుకోవడం అనుమానంగానే ఉంది.

ఆమె బాత్ టాబ్ లో మునిగిపోయి చనిపోయిందని అంటున్నారు. ఆమెకు హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత నీటిలో మునిగిపోయిందా.. లేక పొరపాటున నీటిలో పడి మరణించిందా అన్న విషయాలు పోలీసులు బయటకు చెప్పాల్సి ఉంది. కేసును దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు ట్రాన్స్ ఫర్ చేసినట్లు దుబాయ్ పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here