హ‌స్తిన‌: ప‌ట్ట‌ప‌గ‌లే క‌మ్మేసిన చీక‌ట్లు!

దేశ రాజ‌ధానిలో ప‌ట్ట‌ప‌గ‌లే అంధ‌కారం అల‌ముకుంది. గంట వ్య‌వ‌ధిలో వాతావ‌ర‌ణం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో దుమ్ము తుపాన్‌.. ఒక్క‌సారిగా ఢిల్లీని చుట్టుముట్టింది. దీన్ని చూసిన జ‌నం భయాందోళనలకు గురయ్యారు. ఉదయం నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రత, ఉక్కబోతతో అల్లాడిపోయారు. సాయంత్రం 5 గంటల నుంచి వాతావరణంలో వచ్చిన మార్పు వారిని భ‌యాందోళ‌న‌ల‌కు గురి చేసింది. నిమిషాల వ్యవధిలోనే ఢిల్లీని కారు మబ్బులు కమ్మేశాయి.

పగలే వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్లే పరిస్థితి అక్క‌డ నెల‌కొంది. 5 గంటల నుంచి గాలి దుమారం మొదలైంది. ఆ వెంటనే వర్ష బీభత్సం. ఆకాశం నల్లగా మారిపోయింది. సూర్యుడు మాయం అయిపోయాడు. ఆర్కేపురం, ద్వారక, అక్బర్ రోడ్, చత్తర్ పుర్ ఏరియాల్లో అయితే అప్పుడే కారుచీకట్లు కమ్మేశాయి. 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయటంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here