400 నంబ‌ర్ జెర్సీ ధ‌రించిన బ్రావో..అత‌ని రికార్డు అది! మ‌రొక‌రు కూడా!

ముంబై: వాంఖ‌డె స్టేడియంలో ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన ఐపీఎల్ 11 సీజ‌న్ ఆరంభ మ్యాచ్‌లో డ్వేన్ బ్రావో 400 నంబ‌ర్ జెర్సీ వేసుకుని క‌నిపించాడు. అత‌నితో పాటు అత‌ని విండీస్ టీమ్ మేట్, ముంబై ఇండియ‌న్స్ ఆట‌గాడు కీర‌న్ పొల్లార్డ్ కూడా అదే నంబ‌ర్ జెర్సీతో క‌నిపించాడు. వారు సృష్టించిన స‌రికొత్త రికార్డుకు నిద‌ర్శ‌నం ఆ జెర్సీలు.

టీ20 మ్యాచుల్లో అరుదైన ఘ‌న‌త‌ను వారిద్ద‌రూ సొంతం చేసుకున్నారు. బ్రేవో టీ20ల్లో 400 వికెట్ల‌ను ప‌డ‌గొట్టిన మైలురాయిని అందుకుంటే.. 400 టీ20 మ్యాచ్‌ల‌ను ఆడిన రికార్డ‌ను పొలార్డ్ నెల‌కొల్పాడు. అందుకే..వారిద్ద‌రు వేసుకున్న జెర్సీల‌పై 400 డిజిట్ క‌నిపించింది.

ఒకే దేశానికి చెందిన క్రికెట‌ర్లు వేర్వేరు జట్ల‌కు ఆడుతూ ఒకే నంబ‌ర్ జెర్సీల‌ను వేసుకోవ‌డం అరుదైన విష‌య‌మ‌ని, త‌మకు ఈ అవ‌కాశం ఇవ్వాల‌ని టీమ్ మేనేజ్‌మెంట్‌తో మాట్లాడ‌గా.. అందుకు వారు అంగీక‌రించారు. వాంఖ‌డే మ్యాచ్‌లో బ్రావో ఎలా చెల‌రేగిపోయాడో చూశాం. ఓట‌మి కోర‌ల్లో చిక్కుకున్న జ‌ట్టును గెలిపించాడు బ్రేవో. ఇక‌- ముంబై ఇండియ‌న్స్ త‌ర‌ఫున ఆడిన పొలార్డ్‌కు మాత్రం బ్యాటింగ్‌, బౌలింగ్ ఛాన్స్ రాలేదు.

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here