ఆ పెద్దాయన చివరి కోరిక తన కుక్కను చూడడం.. చూసిన కొన్ని గంటలకు..!

కొందరు.. మనుషులకంటే ఎక్కువగా మూగ జీవాలనే ప్రేమిస్తూ ఉంటారు. అవి కూడా మన మీద ఎంతో ప్రేమను కురిపిస్తాయి. ఓ పెద్దాయన చివరి కోరిక తన పెంపుడు కుక్కను చూడడం.. ఈ విషయాన్ని నర్స్ కు తెలియజేశాడు. అందుకు ఆమె అందరినీ ఒప్పించి.. కుక్కను ఆ పెద్దాయన దగ్గరకు తీసుకొని వచ్చింది. ఆ కుక్క కూడా తన యజమానిని చూసి చాలా సంబరపడింది. కొద్దిసేపు ఆయనతో ఆడుకుంది. ఆ కుక్క కలిసి వెళ్ళిపోయిన కొన్ని గంటలకు ఆ పెద్దాయన తుదిశ్వాస విడిచిపెట్టేశాడు.

ఇదీ మనిషికి.. కుక్కకు ఉన్న అనుబంధాన్ని కళ్ళకు కట్టినట్లు చూపే సన్నివేశం. పీటర్ రాబ్సన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఆయన ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉండేది. అలాంటిది పీటర్ తాను తన కుక్కను చూడాలని అనుకుంటున్నానని చెరిల్ వైట్ అనే నర్సుకు చెప్పుకున్నాడు. ఆమె ఈ విషయాన్ని పీటర్ కుటుంబ సభ్యులకు కూడా చెప్పింది. దీంతో ఆ కుక్కను తీసుకొని వచ్చారు కుటుంబసభ్యులు. ‘షెప్’ అనే తన పెంపుడు కుక్కను చూశాక పీటర్ చాలా ఆనందించాడు. షెప్ కూడా ఆయనతో ఆడుకుంది. ఆక్సిజన్ మాస్క్ కూడా లేకుండా ఆయన షెప్ తో ఆడుకున్నాడు.

ఆ రోజు షెప్ వెళ్ళిపోయాక పీటర్ తనకు చాలా ఆనందంగా ఉంది కుక్కను చూసినందుకు అని ఆసుపత్రి వాళ్లకు చెప్పుకొచ్చాడు. అలా కొద్ది గంటలకు పీటర్ తుదిశ్వాస విడిచాడు. పీటర్ మనవరాలు ఆష్లే స్టీవెన్స్ ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here