నక్క నోటకరచుకున్న కుందేలును తన్నుకుపోడానికి వచ్చిన గ్రద్ధ.. ఎవరు గెలిచారంటే..!

ఓ నక్క తనకు భోజనానికి కుందేలు దొరికిందన్న సంతోషంతో నడుచుకుంటూ వెళుతోంది. అయితే ఓ గ్రద్ధ మాత్రం ఆ నక్కనూ.. ఆ నక్క నోట్లో ఉన్న కుందేలును గమనిస్తూ వస్తోంది. ఈ విషయాన్ని పసిగట్టిన నక్క కూడా ఎంతో జాగ్రత్తగా ఆ సువిశాలమైన మైదానంలో నడుచుకుంటూ వెళుతోంది. ఇంతలో ఆ గ్రద్ధ ఒక్కసారిగా నక్క నోట కరచుకున్న కుందేలును తన పదునైన కాలి గోర్లతో లాక్కొని వెళ్ళాలని ప్రయత్నించింది. అనుకున్నట్లుగానే కిందకు వచ్చి అమాంతంగా పట్టేసుకుంది. అలాగే గాల్లోకి ఎగసింది. గ్రద్ధ బలానికి నక్క కూడా గాల్లో ఎగిరింది. కొన్ని అడుగుల ఎత్తుకు నక్క కూడా గాల్లోనే ఉండిపోయింది. కొద్ది దూరం వరకూ రెండిటినీ గాల్లోకి తీసుకొని వెళ్ళింది గ్రద్ధ.. అయితే అప్పటికే 20 అడుగుల ఎత్తుకు వెళ్ళానని భయపడిందో ఏమో తన ఆహారాన్ని నక్క వదిలేసుకుంది. ఈ దొంగతనంలో గ్రద్ధ గెలిచింది.

ఈ అద్భుతమైన ఘటన వాషింగ్టన్ రాష్ట్రం లోని శాన్ జువాన్ ఐలాండ్ నేషనల్ హిస్టారిక్ పార్క్ లో చోటుచేసుకుంది. ఫోటోగ్రాఫర్లు కెవిన్ ఎబి, జాచరీ హార్ట్జే లు కెమెరాల్లో బంధించారు. తాము గత కొద్ది రోజులుగా ఎరుపు రంగు నక్కలను తమ కెమెరాల్లో బంధిస్తూ ఉన్నామని.. అవి కేవలం సూర్యాస్తమయం సమయంలోనే వేటాడతాయని చెప్పుకొచ్చారు. అలా వేటాడుతుండగా ఓ నక్కకు కుందేలు దొరికిందని.. అయితే ఇంతలోనే ఓ గ్రద్ధ తన బలంతో.. తెలివితో ఆ కుందేలును సొంతం చేసుకుందని ఫోటోగ్రాఫర్లు తమ బ్లాగులో రాశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here