రోడ్డు ప్రమాదంలో యువతి మృతి.. అది తట్టుకోలేని యువకుడు ఏమి చేశాడంటే..!

ప్రియురాలిని పోగొట్టుకున్న బాధ అతడిలో తీవ్ర అలజడిని రేపింది. ఎంతో బాధతో కుమిలిపోయాడు. ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కొన్ని గంటల్లోనే అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

చాగల్లు మండలం మార్కొండపాడు గ్రామానికి చెందిన చోళ్ల అశ్విత (23) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందగా… అదే గ్రామానికి చెందిన ఉన్నమట్ల సునీల్‌రాజు (26) రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మోటారు సైకిల్‌పై వెళ్తున్న వీరిద్దరిని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో గాయపడిన యువతి ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. యువతి మృతిని భరించలేని ఆ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. సునీల్ ను చూసిన కొందరు చికిత్స నిమిత్తం మరో ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు.

అశ్వితను ఆస్పత్రికి తరలించేందుకు సాయపడిన సునీల్‌రాజు చికిత్స పొందుతున్నంతసేపు ఆమెకు సపర్యలు చేశాడు. ఆమె చనిపోయిందని తెలుసుకున్న సునీల్‌రాజు ఆస్పత్రి సమీపంలోని రైలు పట్టాల వద్దకు వెళ్లి అటుగా వస్తున్న సర్కారు ఎక్స్‌ప్రెస్‌ కింద పడి ఆత్మహత్యాయత్నం చేశాడు. మంగళవారం తణుకులో ఏర్పాటు చేసిన జాబ్‌మేళాకు అశ్విత హాజరైంది. సునీల్‌రాజు పదో తరగతి పూర్తి చేసి ప్రస్తుతం తాపీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. మంగళవారం మోటారు సైకిల్‌పై తణుకు వచ్చిన సునీల్‌రాజు జాబ్‌మేళాకు వచ్చిన అశ్వితను కలిశాడు. ఇద్దరూ కలిసి మోటారుసైకిల్‌పై తిరుగు ప్రయాణమయ్యారు. పదహారో నెంబరు జాతీయ రహదారిపై ఉండ్రాజవరం జంక్షన్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వీళ్ళు గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ ఉన్నారని.. ఈ విషయం వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియదని చనిపోయిన వాళ్ళ స్నేహితులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here