రంజాన్! ఆ దేశంలో అయిదు రోజులు వేత‌నంతో కూడిన‌ సెల‌వు..ప్రైవేటు సంస్థ‌ల‌కు కూడా!

ప‌విత్ర రంజాన్ పండగ‌ను పుర‌స్క‌రించుకుని ఒమ‌న్ అయిదురోజుల పాటు సెల‌వును ప్ర‌క‌టించింది. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌తోపాటు అన్ని ప్రైవేటు సంస్థ‌లకు కూడా ఈ సెల‌వు వ‌ర్తిస్తుంది. ఈ నెల 14వ తేదీ నుంచి అయిదురోజుల పాటు అంటే 18వ తేదీ వ‌ర‌కు ప్ర‌భుత్వ‌, ప్రైవేటు సంస్థ‌లు, కార్యాల‌యాలు ఏవీ ప‌నిచేయ‌వు. 19వ తేదీన మ‌ళ్లీ కార్యాల‌యాలు పున‌:ప‌్రారంభిస్తారు. అయిదురోజుల సెల‌వును ప్రైవేటు సంస్థ‌లు వేత‌నంతో కూడిన సెల‌వుగా ప‌రిగ‌ణించాల్సి ఉంటుంది. నెల వేత‌నంలో ఈ అయిదురోజుల‌ను కోత విధించ‌కూడ‌ద‌ని ఒమ‌న్ ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here