ఎమిరేట్స్‌లో అయిదు రోజుల రంజాన్ సెల‌వులు షురూ! జీతం ఇవ్వాల్సిందే!

ప‌విత్ర రంజాన్ పండుగ‌ను పుర‌స్క‌రించుకుని యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ ప్ర‌భుత్వం గురువారం నుంచి అయిదు రోజుల పాటు వ‌రుస సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది. ఈ సెలవులు ప్ర‌భుత్వ‌, ప్రభుత్వ‌రంగంతో పాటు ప్రైవేటు సంస్థ‌ల‌కు కూడా వ‌ర్తిస్తాయి. అయిదురోజుల పాటు వేత‌న సెల‌వుల‌ను ప్ర‌క‌టించింది అక్క‌డి ప్ర‌భుత్వం. సెల‌వు ఉన్న‌ప్ప‌టికీ.. ప్రైవేటు సంస్థ‌లు త‌మ సిబ్బందికి అయిదురోజుల జీతాని ఇచ్చి తీరాల్సి ఉంటుంది. ఈ మేర‌కు ఇదివ‌ర‌కే ఎమిరేట్స్ ప్ర‌భుత్వం ఆదేశాలను జారీ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here