చెరువులో స్నానానికంటూ వెళ్లింది..వృద్ధుడి చేతికి చిక్కింది!

ఇంటికి స‌మీపంలోనే ఉన్న చెరువులో స్నానం చేయ‌డానికంటూ వెళ్లిన ఓ 15 ఏళ్ల‌ బాలికపై క‌న్నేశాడు ఓ వృద్ధుడు. అత‌ని వ‌య‌స్సు సుమారు 60 సంవ‌త్స‌రాలు.

స్నానం చేసి, తిరిగి ఇంటికి వ‌స్తోన్న ఆ బాలిక‌ను అడ్డ‌గించాడు. అత్యాచారం చేశాడు. కొన్ని గంట‌ల పాటు ఆమెను నిర్బంధించి పైశాచికంగా వ్య‌వ‌హ‌రించాడు.

ఈ ఘ‌ట‌న ఒడిశాలోని గంజాం జిల్లాలో చోటు చేసుకుంది. ఆ కిరాత‌కుడి పేరు క‌బీ నాయ‌క్‌. జిల్లాలోని క‌ళింగ‌పాద‌ర్ తాలూకా ప‌రిధిలోని బార్ప‌ళ్లిలో ఈ నెల 22వ తేదీన ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. బాలిక‌, ఆమె త‌ల్లిదండ్రులు కేసు పెట్ట‌డానికి భ‌య‌ప‌డ‌టంతో.. ఈ దారుణ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

స్థానికులు, బంధువుల స‌ల‌హా మేర‌కు బాలిక‌, ఆమె త‌ల్లిదండ్రులు శ‌నివారం సాయంత్రం తారాసింగ్ బ్లాక్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అత‌నిపై పోస్కో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here