స్వ‌తంత్ర అభ్య‌ర్థి..మాయ‌మై మూడురోజులు గ‌డిచినా!

చిక్‌బ‌ళ్లాపుర‌: క‌ర్ణాట‌క‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం జోరుగా సాగుతున్న వేళ‌.. అనూహ్య ప‌రిణామం. స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా ఎన్నిక‌ల బ‌రిలో నిల్చున్న వ్య‌క్తి ఒక‌రు అదృశ్యం అయ్యారు. కింద‌టి నెల 27వ తేదీ నుంచి ఆయ‌న క‌నిపించ‌ట్లేదు. అదృశ్య‌మై మూడు రోజులు గడుస్తున్నా ఆయ‌న జాడ లేకుండా పోయింది. ఆయ‌న పేరు మోహ‌న్‌.

క‌ర్ణాట‌క చిక్‌బ‌ళ్లాపుర జిల్లాలోని శిడ్ల‌ఘ‌ట్ట అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆయ‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను దాఖ‌లు చేశారు. శిడ్ల‌ఘ‌ట్ట నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని గంగ‌న‌హ‌ళ్లి గ్రామానికి చెందిన వ్య‌క్తి. సామాజిక కార్య‌క‌ర్త‌గా చుట్టుప‌క్క‌ల గ్రామాల్లో మంచి పేరు ఉంది. స్థానికులు ఇచ్చిన ప్రోత్సాహంతోనే కింద‌టి నెల 24వ తేదీన నామినేష‌న్ ప‌త్రాల‌ను దాఖ‌లు చేశారు.

27వ తేదీ నాడు నామినేష‌న్ ప‌త్రాల ఉప‌సంహ‌ర‌ణ‌. అదేరోజు ఉద‌యం స్కూట‌ర్‌కు మ‌ర‌మ్మ‌తు చేయించుకొస్తాన‌ని ఇంట్లో నుంచి బ‌య‌టికి వెళ్లిన మోహ‌న్‌.. మ‌ళ్లీ తిరిగి రాలేదు. మూడురోజులైన‌ప్ప‌టికీ జాడ తెలియ‌కుండా పోవ‌డంతో ఆందోళ‌న‌కు గురైన కుటుంబ స‌భ్యులు శిడ్ల‌ఘ‌ట్ట రూర‌ల్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here