ప్ర‌యాణికులు నిజంగా అదృష్ట‌వంతులే! ఆ స‌మ‌యంలో క‌రెంట్ ఉండి ఉంటే?

మండ్య‌: ప్ర‌యాణికుల‌తో నిండుగా ఉన్న బ‌స్సుపై విద్యుత్ స్తంభం కూలిపడ‌టం, విద్యుత్ తీగ‌ల‌న్నీ బ‌స్సుకు చుట్టుకోవ‌డం.. ఈ ఫొటో చూస్తోంటే.. గుండె గుభేల్‌మ‌నిపించ‌ట్లేదూ! విద్యుత్ స్తంభం కూలి బ‌స్సుపై ప‌డిన స‌మ‌యంలో క‌రెంట్ పోయింది. ప్ర‌యాణికులు నిజంగా అదృష్ట‌వంతులే. క‌ర్ణాట‌క‌లోని మండ్య జిల్లాలో సోమ‌వారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న ఇది.

బెంగ‌ళూరు స‌హా క‌ర్ణాట‌క‌లో ప‌లుచోట్ల సోమ‌వారం సాయంత్రం గాలి-వాన బీభ‌త్సం సృష్టించింది. దీని దెబ్బ‌కు మండ్య జిల్లాలోని కోణ‌న‌హ‌ళ్లి గేట్ స‌మీపంలో చాలాచోట్ల‌ విద్యుత్ స్తంభాలు నేల‌కూలాయి. అలా కూలిన ఓ విద్యుత్ స్తంభం నేరుగా ఆర్టీసీ బ‌స్‌పై ప‌డింది. ఆ స‌మ‌యంలో బ‌స్సులో 50 మంది ప్ర‌యాణికులు ఉన్నారు.

 

అది ప‌డే స‌మ‌యానికి క‌రెంటు పోయింది. దీనితో ప్ర‌యాణికులు బ‌తుకుజీవుడా అనుకుంటూ బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం సంభ‌వించ‌లేదు. ఇదే మార్గంలో సుమారు 30కి పైగా క‌రెంటు స్తంభాలు నేల‌కూలాయి. 15 రోజుల కింద‌టే వాటిని ఏర్పాటు చేశార‌ని స్థానికులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here