భ‌యం..భ‌యం! క‌ట్టుబ‌ట్ట‌ల‌తో ఊరొదిలి వెళ్లారు!

హవాయి ద్వీపంలో కిలాయీ అగ్నిపర్వతం బీభ‌త్సాన్ని సృష్టిస్తోంది. ఆ అగ్నిప‌ర్వ‌తం పేలి అయిదు రోజులైన‌ప్ప‌టికీ.. తీవ్ర‌త ఏ మాత్రం త‌గ్గ‌లేదు. మ‌రింత ముదురుతోంది. దీని ప్ర‌భావానికి ప‌హోవా వాల్క‌నిక్ సిటీ మొత్తం ఖాళీ. క‌ట్టుబ‌ట్ట‌ల‌తో ఊరొదిలి వెళ్లిపోయారు. 2000 మందికి పైగా ఉన్న ఈ ఊరి జ‌నాభాను సుర‌క్షిత ప్ర‌దేశానికి త‌ర‌లించారు అక్క‌డి అధికారులు.

ప‌హోవా స‌మీపంలో ఉన్న కిలాయీ అగ్నిపర్వతం నుంచి దాదాపు 200 అడుగుల ఎత్తుకు లావా ఎగ‌జిమ్ముతోంది. అగ్నిప‌ర్వ‌తం నుంచి వెలువడుతోన్న లావా ప‌హోవాను చుట్టుముట్టింది. పొలాలు, రోడ్లు, ఇళ్లు.. అన్నీ దాని బారిన ప‌డ్డాయి. అగ్నిపర్వతం పేలుడు ధాటికి భూకంపాలు ఏర్ప‌డ్డాయి. గురువారం నుంచి త‌ర‌చూ భూమి ప్ర‌కంపిస్తోంది.

రిక్ట‌ర్ స్కేలుపై వాటి తీవ్ర‌త 5.6, 6.9గా న‌మోదైంది. ఈ ప‌రిస్థితి ఇప్ప‌ట్లో త‌గ్గ‌ద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. ఇప్ప‌టికే- 3,87,500 చదరపు మీటర్ల ప్రాంతం వరకు లావా విస్తరించిందని అంటున్నారు. అగ్నిపర్వతం నుంచి లావా ఎగిసిపడుతున్న ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here