ఎమిరేట్స్‌లో షేక్ వ‌ద్ద 17 సంవ‌త్స‌రాలుగా ప‌నిచేస్తున్నందుకు ప్ర‌తిఫ‌లం

ఎమిరేట్స్‌లో 17 ఏళ్ల పాటు ఓ సంస్థ‌లో ప‌నిచేస్తోన్న భార‌తీయునికి అరుదైన కానుక‌ను అందించారు య‌జ‌మాని. స్వ‌దేశంలో జ‌రిగిన ఆ ఉద్యోగి కుమార్తె పెళ్లికి హాజ‌ర‌య్యారు. పెళ్లి ఖ‌ర్చునంత‌టినీ భ‌రించారు. ఆ య‌జ‌మాని పేరు హుస్సేన్ ఇస్సా అల్ డ‌ర్మాకి. యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్‌లోని క‌ల్బాలో ఆయ‌న చెయిన్ రెస్టారెంట్ల య‌జ‌మాని.

అల్ ష‌దా ప్రాజెక్ట్స్ అనే కాంట్రాక్ట్ సంస్థ‌కు అధినేత‌. ఆయ‌న వ‌ద్ద 17 సంవ‌త్స‌రాలుగా కేర‌ళ‌కు చెందిన మ‌హ్మ‌ద్ అనే వ్య‌క్తి ఉద్యోగిగా ప‌నిచేస్తున్నారు. రెండురోజుల కింద‌ట ఆయ‌న కుమార్తె వివాహం జ‌రిగింది. దీనికి డ‌ర్మాకీ హాజ‌ర‌య్యారు. పెళ్లి ఖ‌ర్చుల‌ను భ‌రించారు. పెళ్లిని గ్రాండ్‌గా జ‌రిపించారు. ఈ పెళ్లి ఖ‌ర్చు అనేది మ‌హ్మ‌ద్ నిజాయితీకి తాను ఇస్తోన్న చిరు కానుక అని డ‌ర్మాకి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here