12 మంది మావోయిస్టుల హతం.. భారీ ఎన్ కౌంటర్..!

ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో మరో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఏకంగా 12 మంది మావోయిస్టులు ఇప్పటిదాకా హతమైనట్లు తెలుస్తోంది. అలాగే ఓ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. భూపాలపల్లి సమీపంలోని వెంకటాపురం మండల సరిహద్దుల్లో ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది. ఈరోజు తెల్లవారు జామున ఈ ఎన్ కౌంటర్ మొదలైందని ఇప్పటికి 12 మంది మావోయిస్టులు హతమైనట్టు ప్రాధమిక సమాచారం. మృతుల్లో మావో అగ్రనేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. వారి వివరాలు ఇంకా వెల్లడికాలేదు.

ఛత్తీస్ గడ్ కు సమీపంలోని తడపలగుట్ట, పూజారి కాంకేడు అటవీ ప్రాంతంలో రెండు రాష్ట్రాల స్పెషల్ పార్టీ పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురు పడ్డారు. తమకు ఎదురైన మావోలను లొంగిపోవాలని హెచ్చరించినా వినకుండా ఫైరింగ్ ప్రారంభించడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్ కౌంటర్ ప్రారంభించాల్సి వచ్చిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. చాలా మంది మావోలు పారిపోయారని, అక్కడి నుంచి భారీ ఎత్తున తుపాకులు, పేలుడు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here