ల‌వ‌ర్ కోస‌మే మ్యాచ్ గెలిచాడు..స్టేడియంలోనే ప్ర‌పోజ్ చేశాడు!

గోల్డ్‌కోస్ట్‌: అస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లో జ‌రుగుతున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఓ విభిన్న దృశ్యం క‌నిపించింది. ఓ ఆటగాడు.. త‌న ప్రేయసికి ప్ర‌పోజ్ చేశాడు. ఇంగ్లండ్‌కు చెందిన బాస్కెట్‌ బాల్‌ పురుషుల జట్టుకు చెందిన అండర్సన్‌, ఆ దేశ బాస్కెట్‌ బాల్‌ మహిళల జట్టుకు ప్రాతినిథ్యం వ‌హిస్తోన్న‌ జార్జియా జోన్స్‌కి ప్రపోజ్‌ చేశాడు.

బాస్కెట్‌ బాల్‌ విభాగంలో కామెరూన్‌ జట్టుపై విజయం సాధించిన వెంట‌నే ఇంగ్లండ్‌ జట్టు సభ్యుడు అండర్సన్‌ మోకాలిపై కూర్చోని విల్ యు మ్యారి మీ అంటూ ప్ర‌పోజ్ చేసిన దృశ్యం హైలైట్‌గా నిలిచింది. ఆ లవ్‌ ప్రపోజల్‌కు జోన్స్‌ ఒకే చెప్పగానే అండర్సన్‌ తోటి క్రీడాకారులు ఎగిరి గంతేశారు. వారిద్ద‌రికీ అక్క‌డిక‌క్క‌డే ఎంగేజ్‌మెంట్ చేశారు.

ఈ సంద‌ర్భంగా అండ‌ర్స‌న్ త‌న ల‌వ‌ర్‌కు ఎంగేజ్‌మెంట్ రింగ్‌ను తొడిగాడు. దీనికి సంబంధించిన వీడియో, కొన్ని ఫొటోలను ఇంగ్లండ్‌ బాస్కెట్‌బాల్‌ టీమ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పలువురు క్రీడాకారులు వీరికి బెస్ట్‌ విషెస్‌ చెబుతున్నారు.

https://twitter.com/bballengland/status/982866246763819008

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here