పాకిస్థాన్ తో మ్యాచ్ లో బ్యాట్ మీద వల్గర్ కామెంట్లు రాసుకొచ్చిన బట్లర్..!

ఇంగ్లాండ్-పాకిస్థాన్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ 1-1 తో డ్రా అయింది. మొదటి టెస్టులో పాకిస్థాన్ ఘన విజయం సాధించగా.. రెండో టెస్టులో ఇంగ్లాండ్ అద్భుతంగా ఆడింది. ఇన్నింగ్స్ 55 పరుగుల తేడాతో పాకిస్థాన్ ను మట్టికరిపించింది. జోస్ బట్లర్ 80 పరుగులతో నాటౌట్ గా గిలిచి.. ఇంగ్లాండ్ విజయానికి కారకుడయ్యాడు.

Image result for England Batsman Jos Buttler Writes 'Vulgar Message' On His Bat

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న బట్లర్ మీద ఇప్పుడు సరికొత్త వివాదం వస్తోంది. అదేమిటంటే అతడి బ్యాట్ మీద వల్గర్ వర్డ్స్ ఉండడమే..! ఆ పదాలకు చాలా చెత్త అర్థాలు ఉంటాయి. అలాంటిది కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అతడి బ్యాట్ హ్యాండిల్ చివరన F@#K IT అనే పదం రాసుకొని ఉండడాన్ని ప్రతి ఒక్కరూ గమనించారు. ఆ తర్వాత ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో బట్లర్ ను కొంతమంది తిడుతున్నారు..! క్రికెట్ ను అన్ని వయసుల వారూ చూస్తూ ఉంటారని.. ఇలాంటి పదాలు ఏంటని ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here