మందులు కావాలంటూ వ‌చ్చి..భార‌తీయ ఫార్మ‌సిస్ట్ దారుణ‌హ‌త్య‌!

భార‌త సంత‌తికి చెందిన ఓ మ‌హిళ దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యారు. ఆమె నిర్వ‌హిస్తోన్న మెడిక‌ల్ షాప్‌లోనే ఈ హ‌త్యోదంతం చోటు చేసుకుంది. గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఒక‌రు ఆమెపై కాల్పులు జ‌రిపాడు. ఈ ఘ‌ట‌న‌లో ఆమె అక్క‌డిక‌క్క‌డే క‌న్నుమూశారు. ఆ మ‌హిళ పేరు జెస్సికా ప‌టేల్‌. ఇంగ్లండ్‌లోని మిడిల్స్‌బ్రో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

జెస్సికా ప‌టేల్ పూర్వీకులు గుజ‌రాతీయులు. తన ఇంట్లో ఉన్న జెస్సీకా పటేల్‌ను గత సోమవారం వెంటాడి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. హంతకుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జెస్సికా ప‌టేల్ ఫార్మ‌సిస్ట్‌. త‌న భ‌ర్త మిథేష్‌తో క‌లిసి మిడిల్స్‌బ్రో శివార్ల‌లోని లిన్‌థార్ప్ అవెన్యూలో నివ‌సిస్తున్నారు. వారిది ప్రేమ వివాహం.

మాంఛెస్ట‌ర్ యూనివ‌ర్శిటీలో ఫార్మ‌సీ చ‌దివారు. జెస్సీకా, మిథేష్‌ దంపతులు లిన్‌థార్ప్‌లో మూడేళ్లుగా ఫార్మసీని నడుపుతున్నారని చెప్పారు. ఈ హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియ‌రావ‌ట్లేద‌ని పోలీసులు చెబుతున్నారు. లిన్‌థార్ప్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here