యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రజలకు శుభవార్త.. ఏది కొన్నా సగం ధరే..!

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్న ప్రజలకు అక్కడి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఏ వస్తువు కొన్నా 50శాతం వరకూ డిస్కౌంట్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ‘వరల్డ్ హ్యాపీనెస్ డే’ లో భాగంగా యుఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడ ఉన్న హైపర్ మార్కెట్, సూపర్ మార్కెట్ లలో 50 శాతం డిస్కౌంట్ కే తీసుకోవచ్చని చెప్పారు.

దాదాపు 51 రోహుల పాటూ ఈ ఆఫర్ ఉంది. ఇప్పటికే మార్చి 1న ఆఫర్ మొదలైంది. 13వ గల్ఫ్ వినియోగదారుల రక్షణ దినోత్సవం రోజున ఈ ఆఫర్ ను ప్రవేశపెట్టారు. ఇక కంజూమర్ గూడ్స్ విషయంలో మార్చి 20 నుండి ఏప్రిల్ 20 వరకూ ఈ ఆఫర్ ప్రవేశపెట్టారు. దాదాపు 7500 వస్తువులపై ఈ ఆఫర్ ను ఉంచారు. 3,000 వస్తువులు కో-ఆపరేటివ్ స్టోర్ లో ఉండగా.. 2,000 వస్తువులు క్యారీఫర్, లులు స్టోర్లలో లభ్యమవుతూ ఉన్నాయి. ఈ ఆఫర్ తో యుఏఈ వాసులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు అవసరమైన వస్తువులను తెచ్చుకోడానికి ఎంతగానో పోటీ పడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here