ఎక్స్‌ప్రెస్ ఢీ కొట్టిన వేగానికి జేసీబీ..ప‌ద‌డుగులు గాల్లోకి! రైలింజ‌న్ కూడా!

భువ‌నేశ్వ‌ర్‌: ఎర్నాకుళం-హౌరా అంత్యోద‌య ఎక్స్‌ప్రెస్ ప్ర‌మాదానికి గురైంది. మాన‌వ స‌హిత‌ లెవెల్ క్రాసింగ్ వ‌ద్ద ప‌ట్టాలు దాటుతున్న జేసీబీని రైలు ఢీ కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు ప్ర‌యాణికులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా హ‌రిదాస్‌పూర్ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో బుధ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. గేట్ కీప‌ర్ ఉన్న‌ప్ప‌టికీ.. స‌కాలంలో రైల్వేగేటును వేయ‌లేక‌పోయాడ‌నే కార‌ణంతో.. అధికారులు ఆయ‌న‌ను స‌స్పెండ్ చేశారు. మంగ‌ళ‌వారం రాత్రి కేర‌ళ‌లోని ఎర్నాకుళం నుంచి బ‌య‌లుదేరిన ఎక్స్‌ప్రెస్.. ఈ ఉద‌యం హ‌రిదాస్‌పూర్ స్టేష‌న్ వ‌ద్ద జేసీబీని ఢీ కొట్టింది.

ప‌ట్టాలు దాటుతున్న స‌మ‌యంలో జేసీబీ ఇంజిన్ స్తంభించిపోయింది. ఒక‌ట్రెండు సార్లు స్టార్ట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ.. ఫ‌లితం రాలేదు. అంత‌లో- రైలు శ‌బ్దం వినిపించ‌డంతో కంగారు ప‌డ్డ డ్రైవ‌ర్ దూరంగా ప‌రుగెత్తుకెళ్లాడు. సుమారు 60 కిలోమీట‌ర్ల వేగంతో వ‌చ్చిన ఎక్స్‌ప్రెస్.. జేసీబీని ఢీ కొట్టింది. దీనితో అది ప‌ద‌డుగుల మేర గాల్లోకి ఎగిరింది.

గాల్లో ఉండ‌గానే రెండు ముక్క‌లైంది. దాని ముక్క‌లు ప‌ట్టాల‌పై అటుఇటు ప‌డ్డాయి. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు గాయ‌ప‌డ్డారు. రైలింజిన్ కూడా మొరాయించింది. దాని భాగాలు ధ్వంసం అయ్యాయి. దీనితో రైలు నుంచి వేరు చేశారు. ప్ర‌స్తుతం ఆ రైలు సంఘ‌ట‌నాస్థ‌లంలోనే ఉంది.

 

నిజానికి అది మాన‌వ స‌హిత లెవెల్ క్రాసింగ్‌. గేటు వేస్తున్న స‌మ‌యంలో జేసీబీ డ్రైవ‌ర్‌.. బ‌తిమాలుకోవ‌డంతో అది వెళ్లేలా దారిని వ‌దిలాడు. తీరా- ప‌ట్టాల మీదికి వ‌చ్చిన త‌రువాత అది స్తంభించిపోయింది. దీన్ని బాధ్యుణ్ని చేస్తూ గేట్‌కీపర్ జ‌శోబంత స్వైన్‌ను అధికారులు స‌స్పెండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here