మోడీ రాకను నిరసిస్తూ ఆత్మహత్య చేసుకున్న తమిళనాడు యువకుడు..!

గత కొద్ది రోజులుగా తమిళనాడులో కావేరీ జల వివాదంపై నిరసనలు తీవ్రంగా ఉన్నాయి. అలాంటి తరుణంలో ఈరోజు మోడీ చెన్నై పర్యటన చేపట్టాడు. మోడీ చెన్నై పర్యటనను నిరసిస్తూ ఓ యువకుడు ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోడ్ కు చెందిన ధర్మలింగం ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

డిఫెన్స్ ఎక్స్‌పోలో పాల్గొనేందుకు మోడీ చెన్నై చేరుకోగా.. కావేరీ జలవివాదంపై కేంద్రం తీరుకు వ్యతిరేకంగా ఈరోడ్ లో నివసించే ధర్మలింగం ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ విషయం తన ఇంటి గోడపై రాసి నేటి ఉదయం 9 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధర్మలింగాన్ని ఆసుపత్రికి తరలించగా.. తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు.

ప్రస్తుతం తమిళనాడులో పరిస్థితులు మరింత ఉదృతంగా మారాయి. ప్రతి ఒక్కరూ నలుపు బట్టలు వేసుకొని తమ నిరసనను తెలియజేశారు. ఎప్పుడూ తెలుపు బట్టల్లో ఉండే కరుణానిధి కూడా నలుపు బట్టలు వేసుకొని నిరసన తెలియజేశారు. నలుపు రంగు బెలూన్లను ఆకాశంలోకి వదిలారు కూడానూ.. అలాగే సోషల్ మీడియాలో ‘గో బ్యాక్ మోడీ’ అనేది ట్రెండింగ్ లో ఉంది.

https://twitter.com/Aldrin_Ax/status/984323365673418752

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here