పోకిరీల‌కు భ‌లే శిక్ష! విద్యార్థినుల‌ను వ‌రుస‌గా నిల్చోబెట్టి..వారితో కాళ్లు మొక్కించారు!

ల‌క్నో: విద్యార్థినుల‌ను ఈవ్ టీజింగ్ పేరుతో ఏడిపించే పోకిరీల‌కు ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌ పోలీసులు భ‌లే శిక్ష వేశారు. విద్యార్థినులను వ‌రుస‌గా నిల్చోబెట్టి.. ఈవ్ టీజ‌ర్ల‌తో కాళ్లు మొక్కించారు. దీనికి సంబంధించిన వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని మైన్‌పురి జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

జిల్లాలోని బైద్‌పూర్‌లో పాఠ‌శాల ముందు విద్యార్థినుల‌ను ఏడిపిస్తోన్న ఇద్ద‌రు పోకిరీల‌ను పోలీసులు కాపుగాసి మ‌రీ ప‌ట్టుకున్నారు. వారిని అదే పాఠ‌శాలలోకి తీసుకెళ్లారు. పాఠ‌శాల వ‌దిలేంత వ‌ర‌కూ వారితో ప‌నులు చేయించారు.

అనంత‌రం విద్యార్థినులంద‌ర్నీ వ‌రుస‌గా నిల్చోబెట్టి.. ఆ ఇద్ద‌రితో పాద న‌మ‌స్కారం చేయించారు. ఇంకెప్పుడూ ఇలాంటి ప‌నులు చేయ‌బోమ‌ని ప్ర‌తిజ్ఞ చేయించారు. పోలీసులు తీసుకున్న ఈ నిర్ణ‌యంపై విద్యార్థినుల త‌ల్లిదండ్రులు హ‌ర్షం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here