ఒంట‌రిగా ఉంద‌నుకుని చెయ్యి ప‌ట్టి కారులోకి లాగ‌బోయారు..భ‌ర్త బూటుతో ఉతికి ఆరేసింది!

జ‌లంధ‌ర్‌: రోడ్డు మీద ఒంట‌రిగా వెళ్తోంద‌నుకున్న ఇద్ద‌రు యువ‌కులు చెయ్యి ప‌ట్టుకుని, ఆమెను కారులోకి లాగబోయారు. ఆమె త‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు కారులో వెళ్తూ `అర్జంట్‌` ప‌ని మీద కిందికి దిగింద‌నే విష‌యాన్ని గుర్తించ‌లేదు.

చెయ్యి ప‌ట్టి కారులోకి లాగ‌బోయే స‌మ‌యంలో ఆమె వేసిన కేక‌లు విని.. కుటుంబ స‌భ్యులు ప‌రుగెత్తుకుంటూ వ‌చ్చారు. వారిని చూసిన ఆ ఇద్ద‌రు యువ‌కుల పైప్రాణాలు పైనే పోయాయి.

సుమారు ప‌దిమంది వ‌ర‌కూ ఉన్న కుటుంబ స‌భ్యులు చుట్టుముట్టి చిత‌గ్గొట్టారు. త‌న భ‌ర్త బూటు తీసుకుని మ‌రీ.. ఉతికారేసిందా మ‌హిళ‌. ఈ ఘ‌ట‌న పంజాబ్‌లోని జ‌లంధ‌ర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని బ‌టాలాకు చెందిన ఆ మ‌హిళ పేరు సుఖ్వీంద‌ర్ కౌర్ (పేరుమార్చాం).

త‌న భ‌ర్త, అత్తామ‌మ‌, ఇత‌ర కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి బంధువుల ఇంట్లో శుభ కార్యానికి బ‌య‌లుదేరింది. మార్గ‌మ‌ధ్య‌లో ఆమెకు మూత్రం పోయాల్సిన అవ‌స‌రం రావ‌డంతో ఒంట‌రిగా కిందికి దిగింది. ఆమె భ‌ర్త కారును కొంత దూరంలో తీసుకెళ్లి ఆపాడు. అదే స‌మయానికి ఇంకో కారులో అట‌గా వ‌చ్చారు ఇద్ద‌రు యువ‌కులు.

సుఖ్వీంద‌ర్ కౌర్ ఒంట‌రిగా ఉంద‌నుకుని అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. చెయ్యి ప‌ట్టుకుని కారులోకి లాగ‌బోయారు. దీనితో ఆమె కేక‌లు పెట్టేస‌రికి బిల‌బిల‌మంటూ ఆమె కుటుంబ స‌భ్యులంతా వ‌చ్చేశారు. ఇద్ద‌ర్నీ ప‌ట్టుకుని దేహ‌శుద్ధి చేశారు. త‌న భ‌ర్త బూటు తీసుకుని మ‌రీ ఇద్ద‌ర్నీ ఉతికి ఆరేసిందా మ‌హిళ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here