తెల్లవారుజామున రాడ్డుతో ఆరు మందిని చంపిన ఆర్మీ మాజీ అధికారి.. అడ్డు వచ్చిన పోలీసులను కూడా..!

ఆర్మీ మాజీ అధికారి ఒకరు ఒకరు తెల్లవారు జామున ప్రజలపై రాడ్డుతో విరుచుకుపడ్డాడు. హర్యానా రాష్ట్రం లోని పల్వాల్ లో ఆరుగురిని ఇనుప రాడ్డుతో మోది చంపేశాడు. దేశ రాజధాని ఢిల్లీకి 80 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హత్యలు తెల్లవారుజామున 2:30 నుండి 3:20 మద్య చోటుచేసుకున్నాయి.

పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోడానికి ప్రయత్నిస్తుంటే వారిపై కూడా దాడి చేయబోయాడు. పల్వాల్ పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈ హత్యలు నమోదయ్యాయి. హత్యలు చేసిన వ్యక్తిని నరేష్ కుమార్ గా గుర్తించారు. అతడికి మానసికంగా సమస్యలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. మొదట ఆసుపత్రిలోని ఓ మహిళను ఆ వ్యక్తి చంపేశాడు. ఆ తర్వాత ఆగ్రా రోడ్డు-మైనర్ గేట్ మధ్య ప్రాంతంలో మరో నలుగురిని చంపేశాడు. ఇక చివరిగా ఓ సెక్యూరిటీ గార్డును చంపేశాడు. గతంలో నరేష్ కుమార్ ఆర్మీలో కెప్టెన్ గా సేవలు అందించాడు. ప్రస్తుతం హర్యానా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉన్నాడు.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ రికార్డింగ్ ను పోలీసులు విడుదల చేశారు. అందులో ఓ వ్యక్తి బ్లూ కలర్ స్వెటర్ వేసుకొని ఆసుపత్రిలో రావడం రికార్డు అయింది. ఆ తర్వాత 2:30 నిమిషాలకు అతడు ఓ రాడ్డు పట్టుకొని వచ్చాడు. ఐసీయు బయట ఉన్న 35సంవత్సరాల వయసున్న మహిళను అతడు హత్య చేశాడు. ఆ తర్వాత అతడు బయటకు వెళ్ళి చంపడం మొదలుపెట్టాడు. అతడు చంపినవారి మృతదేహాలు రెండు నుండి మూడు కిలోమీటర్ల దూరంలో పడ్డాయి. ఒక గంట సమయంలో అతడు ఈ పని చేశాడు. ఆదర్శ్ నగర్ ప్రాంతంలో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులను కూడా అతడు చంపాలని ప్రయత్నించాడు. ప్రస్తుతం అతన్ని ఫరీదాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here