మాజీ ప్రేయసిని.. పబ్లిక్ పార్క్ కు రమ్మన్నాడు..!

వారిద్దరూ కొద్ది రోజుల క్రితం బ్రేకప చెప్పుకొని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఆ యువకుడికి తన ప్రేయసిని మరచిపోవడం కష్టం అయింది. అందుకే ఒకసారి ఆమెను కలవాలని ఉంది రమ్మని పిలిచాడు.. ఎక్కడికి పడితే అక్కడికి రమ్మని పిలిచింటే ఆ యువతి రాకుండా ఉండేదేమో.. కానీ అతడు పిలిచింది పబ్లిక్ పార్క్ కు.. అక్కడైతే ఎక్కువ మంది ఉంటారు.. తనకు ఎటువంటి ప్రమాదం లేదు అని అనుకుందో ఏమో ఆ యువతి.. చెప్పినట్లే వచ్చేసింది. అయితే అతడి ఉద్దేశం మరొకటి అని అసలు ఊహించలేదు. ఆమెను పార్కులోనే బెదిరించి.. ఎలుకల మందు తినిపించేశాడు. ప్రస్తుతం ఆమె ఐసీయులో ఉంది.

ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ముంబైలోని కంజుమార్గ్ ప్రాంతానికి చెందిన కిషన్ సోనవానే (24) అదే ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల యువతి తో ఐదేళ్లు ప్రేమ పురాణాన్ని నడిపాడు. అయితే ఇతడి ప్రవర్తన నచ్చక ఆమె బ్రేకప్ చెప్పేసింది. యువతి దూరమవడాన్ని తట్టుకోలేకపోయిన కిషన్ మాట్లాడాలని ఉందని ఆమెకు ఫోన్ చేసి చెప్పాడు. విఖ్రోలీలోని గార్డెన్ కు రమ్మన్నాడు. ఏదీ ఆలోచించకుండా పబ్లిక్ పార్క్ కే కదా అని ఆ యువతి అక్కడకు వచ్చింది. అక్కడ ఆమెను కత్తితో బెదిరించి, ఎలుకలమందు బిళ్ల తినిపించాడు. దీంతో ఆమె అపస్మారక స్థితి లోకి వెళ్ళిపోయింది. పార్క్ లో ఆ యువతి కుప్పకూలడం చూసిన తోటి ప్రజలు ఆమెను దగ్గర లోని ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు. పోలీసులు ఆమెతో విషయం గురించి అడగ్గా మొత్తం చెప్పేసింది. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. పార్క్ లో నుండి పారిపోయిన కిషన్ ను పోలీసులు వేరే ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here