చివరికి పోర్న్ స్టార్ తో కూడా సంబంధాలు పెట్టుకున్న ట్రంప్.. ఇంతకూ ఎవరామె..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై అమ్మాయిల విషయంలో పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే..! పక్కనే భార్యను పెట్టుకొని పలువురు మహిళలను వేధించాడు కూడా. పలువురు సేలేబ్రితీలతో పొందు కోసం వెంపర్లాడేవాడని చాలా మంది ఆరోపించారు. చివరికి ఓ పోర్న్ స్టార్ తో కూడా శారీరక సంబంధాలు పెట్టుకున్నాడని తాజాగా వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చి సెటిల్మెంట్లు చేసుకున్నాడట..!

ఇంతకూ ఎవరామె..
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాకముందు పోర్న్ స్టార్ స్టిఫానీ క్లిఫార్డ్ తో సంబంధం పెట్టుకున్నాడని ప్రముఖ మీడియా దిగ్గజం అయిన వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. స్టిఫానీ అమెరికా జాతీయురాలైన పాపులర్ పోర్న్ స్టార్. 2006లో ఓ గోల్ఫ్ గేమ్ సందర్భంగా ట్రంప్ కు ఆమె పరిచయం అయింది. అప్పటికి మెలానియాను ట్రంప్ మూడో వివాహం చేసుకున్నా కానీ స్టిఫానీతో ట్రంప్ శారీరక సంబంధం పెట్టుకున్నాడని వాల్ స్ట్రీట్ కథనంలో రాసి ఉంది.

అధ్యక్ష ఎన్నికల బరిలోకి ట్రంప్ దిగుతున్న సమయంలో, ఈ విషయం గురించి మాట్లాడేందుకు ఆమె ప్రయత్నించింది. కానీ విషయం బయటకు రాకుండా చూసేందుకు మైఖెల్ కోహెన్ అనే లాయర్ ద్వారా సెటిల్మెంట్ చేశారు. ఏకంగా లక్షా ముప్పై వేల డాలర్లను ముట్టజెప్పి ఈ విషయాన్ని బయటపెట్టవద్దని చెప్పారని వాల్ స్ట్రీట్ జర్నల్ బయటపెట్టింది. ఈ విషయంపై అమెరికాలో పెద్ద దుమారమే చెలరేగింది. ఒకవేళ స్టిఫానీ ఇది నిజమేనని ఒప్పుకుంటే ట్రంప్ పరువూ.. పదవి పోతుందేమో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here