డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ ను చితక్కొట్టారు.. ప్రస్తుతం ఐసీయులో..!

డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ ను ఆరుగురు వ్యక్తులు కలిసి చితక్కొట్టారు. ఇంతకూ ఎందుకు కొట్టారో తెలుసా..? పార్కింగ్ ప్లేస్ కోసం. మాజీ డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్, బాడీ బిల్డర్ అయిన టామ్ మ్యాగీ వారు కొట్టిన దెబ్బలకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

59 సంవత్సరాల టామ్ ను పార్కింగ్ ప్లేస్ కోసం జరిగిన గొడవలో ఆరు మంది కలిసి దాడి చేశారు. లాస్ ఏంజెల్స్ లోని మార్ విస్టా హోమ్ ముందు ఈ గొడవ జరిగింది. టామ్ ను కొట్టిన వాళ్ళంతా యువకులేనని తేలింది. అందరూ కలిసి టామ్ ను కింద పడేసి.. కాళ్ళతో తన్నడం.. పిడిగుద్దులు కురిపించడం చేశారని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. అతడు దవడ భాగం చీలిపోయిందని.. అలాగే కంటి దగ్గర కూడా తీవ్ర గాయమైందని తెలిపారు. వెంటనే టామ్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి ఐసీయులో చికిత్స అందిస్తూ ఉన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

టామ్ 1980ల్లో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లో భాగంగా ఉన్నాడు. ప్రస్తుతం అది డబ్ల్యూడబ్ల్యూఈ అయింది. బ్రెట్ హిట్ మ్యాన్ హార్ట్ ను ఓడించడం టామ్ గొప్ప విజయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇక 1982లో జరిగిన వరల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ కాంపిటీషన్ లో రెండో స్థానంలో నిలిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here