హిజ్రాలను ఎప్పుడూ అవమానించకూడదు.. వారికి దానం చేయడం మంచిదే.. ఎందుకో తెలుసుకోండి..!

ట్రైన్ లలో ప్రయాణీకులను వేధిస్తూ డబ్బులు లాక్కొనే వాళ్ళుగానే హిజ్రాలుగా భావిస్తాం.. కానీ వారు కూడా స్త్రీ, పురుషులలాగే ఈ సృష్టిలో వారు కూడా ఒక భాగమే..! హిందూ ధర్మంలో అయితే హిజ్రాలకు దానం చేయడం చాలా విశిష్టమైన కార్యం. పండుగల సమయంలోనూ.. ఇంట్లో ఏవైనా శుభకార్యాలు జరిగిన సమయంలోనూ హిజ్రాలకు దానం చేయడం వలన మనకు శుభం కలుగుతుందట. ఇప్పుడంటే బెదిరిస్తూ డబ్బులు గుంజే హిజ్రాలు ఉన్నారు కానీ.. గతంలో ఇలాంటి దాన ధర్మాల వల్ల వచ్చే డబ్బులతో బ్రతికేవారట వాళ్ళు.

ముఖ్యంగా హిజ్రాలకు దానం చేయడం వలన మన జీవితాల్లో పేదరికం అన్నది ఉండదట.. పేదరికం అన్నది దూరం అవుతుంది. హిజ్రాలు మనం బాగుండాలని ఇచ్చే దీవెనలు చాలా పవర్ ఫుల్ అట.. వాటి వలన మనకు మంచి జరుగుతుందని ఓ నమ్మకం. లాగే ఎవరి జాతకంలో అయినా బుధ గ్రహ దోషం ఉంటే హిజ్రాలకు దానం చేయడం మంచింది. జ్యోతిష్యం ప్రకారం హిజ్రాలుగా మారడానికి బుధ గ్రహమే కారణమట.. అందుకే ఆ దోష నివారణకు హిజ్రాలకు దానం చేయాలి.

ఎట్టి పరిస్థితుల్లోనూ హిజ్రాలను అవమానించరాదట.. హిజ్రాల ప్రార్థలకు ఎంత పవర్ ఉంటుందో వారు తిట్టే తిట్లకు, శాపనార్థాలకు అంతే పవర్ ఉంటుంది. పొరపాటున కూడా వారితో తిట్టించుకోకండి. ఎందుకంటే వారు కానీ తిడితే జీవితంలో ఎన్నో కష్టాలు కొనితెచ్చుకోవలసి ఉంటుంది. అలాగే మనశ్శాంతి కూడా నశిస్తుందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here