మ‌హిళ‌లు, అమ్మాయిలను మాత్ర‌మే ఆశీర్వ‌దిస్తాడ‌ట‌!

అత‌నో సాధార‌ణ వ్య‌క్తి. బాబా అవ‌తారం ఎత్తాడు. మ‌హిమ‌లు ఉన్నాయంటూ న‌మ్మించాడు. ఓ ఆశ్ర‌మాన్నే స్థాపించేశాడు. బాబా ముసుగులో ఏం చేసినా చెల్లుతుంద‌నేది అత‌ని అత్యాశ‌.

త‌న‌కు తాను అవ‌తార పురుషుడిగా ప్ర‌క‌టించుకున్న ఆ బాబాకు.. మ‌హిళ‌లు, అమ్మాయిల‌ను మాత్ర‌మే ఆశీర్వ‌దిస్తాడ‌నే పేరుంది. అదే అత‌ని కొంప ముంచింది. ఓ మ‌హిళ ప‌ట్ల అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. దీనికి ఫ‌లితం అనుభ‌వించాడు.

ఆ బాబా ప‌ట్ల బాధిత మ‌హిళ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ బురిడీ బాబాపై కేసు న‌మోదు చేశారు. కర్ణాటకలోని చిత్ర‌దుర్గ జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

జిల్లాలోని హొసదుర్గ తాలూకా కంచీపురం గ్రామానికి చెందిన లోకేష్‌ అనే వ్యక్తి బురిడీబాబా అవ‌తారం ఎత్తాడు. అదే గ్రామంలో ఆశ్ర‌మాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

త‌న‌కు కంచీవరద స్వామి పూనుతున్నాడని ప్రజలను నమ్మించాడు. దీనితో అత‌ని ఆశ్ర‌మానికి భ‌క్తుల తాకిడి పెరిగింది. కంచీపురం గ్రామానికే చెందిన ఓ ఉపాధ్యాయుని కుమార్తె బెంగ‌ళూరులో ఇంజినీరింగ్‌ చదువుతోంది.

ఆమెను తనకు ఇచ్చి పెళ్లి చేయాలంటూ కంచీవ‌ర‌ద‌ స్వామి ఆదేశించారని ప్ర‌చారం చేశాడు. ఈ విష‌యాన్ని ఆ యువ‌తి తల్లిదండ్రుల వద్ద ప్ర‌స్తావించాడు.

దీనితో అత‌ని దుర్బుద్ధిని గ‌మ‌నించిన ఆ యువ‌తి బంధువులు ప్రజలకు తెలియజేశారు. ఈ విషయంపై స్థానిక పోలీసు స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ఆరంభించారు. లోకేష్ నేప‌థ్యంపై ఆరా తీస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here