గ్యాంగ్‌రేప్ కేసులో పోలీసుల మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్‌: త‌న‌పై గ్యాంగ్‌రేప్ జ‌రిగిన‌ట్టు నాట‌కం ఆడిన మ‌హిళ‌

మొన్న‌టికి మొన్న నాగ‌ర్‌క‌ర్నూల్‌లో స్వాతి అనే మ‌హిళ ప్రియుడి మోజులో ప‌డి భ‌ర్త‌ను హ‌త‌మార్చింది. త‌న భ‌ర్త స్థానంలో ప్రియుడిని తీసుకుని రావ‌డానికి విఫ‌లయ‌త్నం చేసింది. ఇదీ అలాంటి ఘ‌ట‌నే. బెంగ‌ళూరులో చోటు చేసుకుంది.

ఓ యువ‌తి త‌న భ‌ర్త నుంచి విడిపోయి.. ప్రియుడితో క‌లిసి ఉండ‌టానికి కుట్ర ప‌న్నింది. భ‌ర్త త‌న‌ను అస‌హ్యించుకునేలా చేయాల‌ని ప‌థ‌కం పన్నింది. త‌న‌పై గ్యాంగ్‌రేప్ జ‌రిగిన‌ట్టు చిత్రీక‌రించుకుంది.

గ్యాంగ్ రేప్ జ‌రిగితే.. భ‌ర్త త‌న‌ను అస‌హ్యించుకుని, విడాకులు ఇచ్చేస్తాడ‌ని భావించిందామె. ఆ ఆలోచ‌న రావ‌డ‌మే ఆల‌స్యం.. దాన్ని అమ‌లు చేసింది. న‌లుగురు వ్య‌క్తుల‌కు డ‌బ్బులు ఇచ్చింది.

త‌న‌పై గ్యాంగ్‌రేప్ జ‌రిగిన‌ట్టు నాటకం ఆడించింది. ఈ వ్య‌వ‌హారం వెలుగులోకి రావ‌డంతో ఆమె క‌ట‌క‌టాల‌పాలైంది. బెంగ‌ళూరు బ్యాట‌రాయ‌ణ‌పుర పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

కావ్య (పేరుమార్చాం) అనే యువ‌తికి గ‌త ఏడాది సురేష్ (పేరుమార్చాం)తో పెళ్ల‌యింది. అప్ప‌టికే ఆమెకు ప్రియుడు ఉన్నాడు. పెళ్ల‌యిన‌ప్ప‌టికీ.. ప్రియుడిని మ‌రిచిపోలేక పోయింది.

శాశ్వ‌తంగా సురేష్‌ను వ‌దిలి రావ‌డానికి ప్రియుడితో క‌లిసి ప‌థ‌కం ప‌న్నింది. ఈ నెల 5వ తేదీన బ్యాట‌రాయ‌ణ‌పురలోని టింబ‌ర్ యార్డ్ లే అవుట్‌లోని షాలిని గార్మెంట్స్ నుంచి న‌డుచుకుంటూ వెళ్తుండ‌గా.. ఉద‌యం 9:40 గంట‌ల స‌మ‌యంలో ఓ వ్య‌క్తి త‌న‌ను మారుతి వ్యాన్‌లో కిడ్నాప్ చేశాడంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

మారుతి వ్యాన్‌లో త‌న‌ను నిర్జ‌న ప్ర‌దేశానికి తీసుకెళ్లార‌ని, సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డార‌ని ఫిర్యాదులో పేర్కొంది. త‌న చెవిక‌మ్మ‌లు, ఉంగ‌రం, మంగ‌ళసూత్రాన్ని చోరీ చేశార‌ని, అదే రోజు రాత్రి 8 గంట‌ల‌కు త‌న‌ను క‌ళాసిపాళ్య బ‌స్‌స్టాప్ వ‌ద్ద వ‌దిలేసి పారిపోయార‌ని పేర్కొంది.

ఈ ఘ‌ట‌న‌పై బ్యాట‌రాయ‌ణ‌పుర పోలీసులు స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వారి ద‌ర్యాప్తులో ఎక్క‌డా పోలీసుల‌కు స‌రైన లీడ్ దొర‌క‌లేదు. దీనితో వారి అనుమానం మొద‌ట కావ్య పైకే వెళ్లింది. ఆమెను అదుపులోకి తీసుకుని, విచారించ‌గా పొంత‌నలేని స‌మాధానాల‌ను ఇచ్చింది.

దీనితో పోలీసులు ఆమెను త‌మ‌దైన శైలిలో విచారించ‌గా.. అస‌లు విష‌యాన్ని వెల్ల‌డించింది. దీనితో పోలీసులు షాక్‌కు గుర‌య్యారు. ఆమెతో పాటు సురేష్‌, మ‌రో న‌లుగురిని అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here