తారక్ భయ్యా.. కంగ్రాట్స్ అన్నారు.. అదంతా ఫేక్ అట..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు కారణం ఓ వార్త వైరల్ అవ్వడమే.. ఆయన మరోసారి తండ్రి అయ్యాడని.. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులకు ఆదివారం రాత్రి 10.20 గంటల సమయంలో పండంటి పాప జన్మించినట్టు వార్తలు వచ్చాయి. ఈ విషయం ఆయన అభిమానులకు చేరడంతో సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతున్నారు అభిమానులు. అయితే ఇదంతా అబద్దమని చెప్పేశారు ఎన్టీఆర్ పీఆర్ఓ కోనేరు మహేష్.

ఇప్పటికే ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులకు అభయ్ అనే కుమారుడు ఉన్నాడు. ఇప్పుడిక అభయ్ కి ఓ చెల్లెలు కూడా పుట్టిందన్న వార్త వైరల్ అవుతుండగా, సోషల్ మీడియాలో ఎన్టీఆర్ దంపతులకు టాలీవుడ్ పెద్దలు, అభిమానుల నుంచి పెద్దఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ఎన్టీఆర్ కుటుంబసభ్యుల నుంచి అధికారిక సమాచారం రాలేదు. ఇంతలో కోనేరు మహేష్ ఇదంతా అబద్దమని చెప్పి.. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి అని హితవు పలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here