రాష్ట్రప‌తిని కూడా వ‌ద‌ల్లేదు! రామ్‌నాథ్ కోవింద్ మీద‌ ఫేక్ న్యూస్ రాశారు..అది నిజ‌మ‌ని న‌మ్మిన ఓ వ్య‌క్తి..!

మీడియాలో అడ్డ‌గోలు రాత‌లు, క‌థ‌నాల ప్రసారాల‌కూ అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఈ విష‌యంలో మ‌న తెలుగు మీడియాను త‌న్నేవాడే లేడ‌నుకున్నాం ఇన్నాళ్లూ. ఇష్టానుసారంగా క‌థ‌నాలు, రాయ‌డంలో వార్త‌ల‌ను ప్ర‌సారం చేయ‌డంలో తెలుగు మీడియాకు తామేమీ తీసిపోమ‌ని చెబుతోంది రాజ‌స్థాన్ మీడియా.

ఏకంగా రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్ మీదే ఓ ఫేక్ న్యూస్ రాశారు అక్క‌డి మీడియా ప్ర‌తినిధులు. అది నిజ‌మ‌ని న‌మ్మిన ఓ వ్య‌క్తి.. తోటి వ్య‌క్తిపై దాడికి పాల్ప‌డ్డాడు. అత‌ని మీద హ‌త్యాయ‌త్నం చేశాడు. రాజ‌స్థాన్‌లోని పుష్క‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్, ఆయ‌న భార్య‌ కొద్దిరోజుల కింద‌ట రెండురోజుల పాటు రాజ‌స్థాన్‌లో ప‌ర్య‌టించారు.

ఈ సంద‌ర్భంగా వారు పుష్క‌ర్‌లోని ప్ర‌ఖ్యాత్ బ్ర‌హ్మ‌దేవుడి ఆల‌యాన్ని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన అర్చ‌కుడు రామ్‌నాథ్ కోవింద్ దంప‌తుల‌ను ఆల‌యంలోకి రానివ్వ‌లేదని, ద‌ళితుడు కావ‌డం వ‌ల్ల వారిని బ‌య‌టి నుంచి ద‌ర్శనం చేయించిన‌ట్లు స్థానిక మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. అది నిజం కాదు.

రాష్ట్రప‌తి అంత‌టి వ్య‌క్తి వ‌చ్చిన త‌రువాత ఏ ఆల‌యంలోనైనా ప్ర‌వేశం క‌ల్పించ‌కుండా ఉంటారా? ఈ మాత్రం ప‌రిజ్ఞానం కూడా లేకుండా క‌థ‌నాలు అచ్చేసింది స్థానిక మీడియా. ఆ వార్త నిజ‌మ‌ని న‌మ్మిన పుష్క‌ర్‌కు చెందిన వ్య‌క్తి ఒక‌రు.. ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కుడిపై దాడి చేశాడు. బ్ర‌హ్మ‌దేవుడి ఆల‌యంలోనే ఆ వ్య‌క్తి పూజారిపై క‌త్తితో దాడి చేశాడు. ఈ ఘ‌ట‌న‌లో పూజారి ఎడ‌మ చెయ్యికి తీవ్ర గాయ‌మైంది.

ఆ స‌మ‌యంలో అక్క‌డే ఉన్న కొంద‌రు భ‌క్తులు దాడి చేస్తోన్న వ్య‌క్తిని అడ్డుకున్నారు. ఈ విష‌యం తెలియ‌డంతో.. రాష్ట్రప‌తి భ‌వ‌న్ ప్రెస్ కార్య‌ద‌ర్శి హుటాహుటిన ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. రామ్‌నాథ్ కోవింద్ ప్ర‌వేశాన్ని అంద‌రూ స్వాగ‌తించార‌ని, ఆల‌యంలో సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా పూజ‌లు చేశార‌ని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here