బంగ్లాదేశ్ గెలుస్తుందని లక్ష రూపాయల్ బెట్ వేసి ఓడిపోయాడు.. అది కట్టలేక ఏమి చేశాడంటే..!

బెట్టింగ్.. మారుమూల గ్రామాలకు కూడా పాకిపోయింది. ఒక్క మన దేశంలోనే కాదు.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల్లో కూడా క్రికెట్ మ్యాచ్ ల సమయంలో బెట్టింగ్ లు భారీగా జరుగుతూ ఉంటాయి. అలా బెట్టింగ్ లో ఓడిపోయిన ఆ బంగ్లాదేశ్ వ్యక్తి ఓ మేకప్ ఆర్టిస్ట్ సహాయంతో తాను చనిపోయినట్లు ఓ వీడియో రికార్డు చేయించి.. డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తికి పంపించాడు. ఆ వీడియో ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పోలీసులు దాని మీద దృష్టి సారించారు.. బెట్టింగ్ డబ్బులు ఎగ్గొట్టడానికే ఈ పని చేశాడని గుర్తించారు.

ఆదెల్ షికదర్ అనే బంగ్లాదేశ్ వ్యక్తి నిదహాస్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ మీద బంగ్లాదేశ్ గెలుస్తుందని బెట్టింగ్ కాశాడు. దినేష్ కార్తీక్ అద్భుతమైన ఆటతీరుతో బంగ్లాదేశ్ కు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో ఆదెల్ లక్ష రూపాయలకు పైగా బెట్టింగ్ డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది. కానీ అతడి దగ్గర అంత డబ్బులు లేవు. దీంతో తాను చనిపోయినట్లు నాటకం ఆడాడు.. మేకప్ ఆర్టిస్ట్ సహాయంతో చనిపోయినట్లు ఒక నాటకం ఆడాడు. కొద్దిగా ఎరుపు రంగు కలర్ ను వాడి చనిపోయినట్లు చూపించాడు. వేరే వాళ్ళ నంబర్ నుండి ఆ వీడియోను బెట్టింగ్ వేసిన వ్యక్తికి పంపించాడు. ఆదెల్ చనిపోయాడని నమ్మించాడు. ఆ వీడియోలో ఆదెల్ తో పాటూ మరో ఇద్దరు ఉన్నారు. అయితే ఆ వీడియో ఎవరో సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో అది కాస్తా వైరల్ అయిపోయి కూర్చొంది. అంతేకాకుండా ఆదెల్ కనిపించకుండా పోవడంతో అతడి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

దీంతో పోలీసులు ఆ ఘటన గురించి ఇన్వెస్టిగేట్ చేశారు. మొదట మేకప్ ఆర్టిస్ట్ ను పట్టుకున్నారు. ఆదెల్ ఉన్న చోటును చెప్పేశాడు. పోలీసులు అతన్ని పట్టుకొని వచ్చి మీడియా ముందు హాజరు పరిచారు. తాను ఆ బెట్టింగ్ డబ్బులను ఎగ్గొట్టడానికే ఇలాంటి పని చేశాను తప్పితే ఇంకే ఉద్దేశం లేదని చెప్పాడు. వైరల్ కాకుండా ఉండి ఉంటే బాగున్ను అని అతడు సమాధానం ఇచ్చాడు. ఆ వీడియో నిజమని నమ్మి 10000 మందికి పైగా షేర్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here