బాలింత‌కు మెరుగైన వైద్యం కోసం మూడు కార్పొరేట్ ఆసుప‌త్రుల చుట్టూ తిరిగినా!

హైద‌రాబాద్‌: పోయే ప్రాణాల‌ను నిలిపే వైద్యులంటే దేవుడితో స‌మానం. అందుకే వారిని వైద్యో నారాయ‌ణో హ‌రీ అని అంటుంటారు. అలాంటి డాక్ట‌ర్లు ఇప్పుడు ప్రాణాల‌ను హ‌రీమ‌నిపించేస్తున్నారు. క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన ఓ మ‌హిళ‌కు స‌కాలంలో, స‌రైన వైద్యాన్ని అందించ‌లేక‌పోయారు. మూడు కార్పొరేట్ ఆసుప‌త్రుల చుట్టూ తిరిగిన‌ప్ప‌టికీ.. ఫ‌లితం లేదు.

చివ‌రికి ఆమె ప్రాణ‌మే పోయింది. హైద‌రాబాద్‌ మణికొండకు చెందిన సౌమ్య కాన్పు కోసం కింద‌టి నెల 27వ తేదీన‌ నవోదయ ఆసుప‌త్రికి వచ్చారు. ఆమెకు మరుసటి రోజు సిజేరియన్‌ చేయగా పాప, బాబు కవల పిల్లలు జన్మించారు. ఆమె ఆరోగ్యం క్షీణించ‌డంతో మెరుగైన చికిత్స కోసం బర్కత్‌పురలోని నవోదయ షాలిని ఆసుప‌త్రికి తీసుకెళ్లారు.

అక్కడ సౌమ్యకు మళ్లీ శస్త్ర చికిత్స చేశారు. అక్క‌డ కూడా ప‌రిస్థితి మెరుగు ప‌డ‌క‌పోవ‌డంతో కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌ యశోద ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. దీనితో కుటుంబీకులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ మృత‌దేహంతో న‌వోద‌య ఆసుప‌త్రి ముందు ఆందోళ‌న చేశారు. అప్పుడే పుట్టిన క‌వ‌ల పిల్ల‌ల‌కు త‌ల్లి లేకుండా పోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here