టబును ఎయిర్ పోర్ట్ లో ఓ అభిమాని..!

ఎన్నో ఏళ్లుగా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ను కృష్ణ జింక కేసు వేటాడుతున్న సంగతి తెలిసిందే.. దాదాపు రెండు దశాబ్దాలుగా ఈ కేసు విచారణ సాగుతూనే ఉంది. 1998లో ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’ సినిమా షూటింగ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సినిమాలో నటీనటులను కూడా జోద్ పూర్ కోర్టు విచారిస్తూ వస్తోంది. ఈ కేసు విచారణకు బుధవారం నాడు టబు హాజరైంది. ఈ కేసులో తీర్పు నేడు రానుంది.

విచారణకు హాజరైన టబుకు జోధ్ పూర్ ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురైంది. అభిమానం పేరుతో ఆమెను వేధించాడు ఏకంగా..! తిరిగివెళ్లేందుకు జోధ్ పూర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆమెతో ఒక అభిమాని సెక్యూరిటీని దాటుకుని మరీ ఆమె వద్దకు వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. తాకడానికి ప్రయత్నించాడని.. ఎక్కడపడితే అక్కడ చేతులు వేయడానికి ప్రయత్నించాడని అక్కడ ఉన్న తోటి ప్రయాణీకులు చెప్పారు. కాస్త ఆలస్యంగా అక్కడకు వచ్చిన బౌన్సర్లు అతన్ని పక్కకు లాగిపడేయడంతో టబుకు అతడి టెన్షన్ తగ్గిపోయింది.

 

1998లో వచ్చిన ‘హమ్‌ సాథ్‌ సాథ్‌ హై’ చిత్రీకరణ సమయంలో సల్మాన్‌ కృష్ణజింకను వేటాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో సైఫ్‌ అలీ ఖాన్‌, సోనాలి బింద్రే, టబు కూడా ఉండటంతో కోర్టుకు వాళ్ళు కూడా హాజరు అవుతూ వస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here