ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో చెక్ ఇన్ చేసిన అయిదోరోజు.. బాత్‌ట‌బ్‌లో!

చండీగ‌ఢ్‌: ఫైవ్‌స్టార్ హోట‌ల్‌లో చెక్ ఇన్ అయిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలో బాత్‌ట‌బ్‌లో మృత‌దేహ‌మై క‌నిపించిందో ఎన్నారై మ‌హిళ‌. హ‌ర్యానాలోని ఫ‌రీదాబాద్ జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృతురాలి పేరు ఇంకా తెలియ‌రావ‌ట్లేదు. ఆమె ఎలా మ‌ర‌ణించింద‌నేది కూడా మిస్ట‌రీగా మారింది.

న్యూఢిల్లీ సౌత్ ఎక్స్‌టెన్ష‌న్ ప్రాంతానికి చెందిన మ‌హిళ ఆమె. 15 సంవ‌త్స‌రాల కింద‌ట లండ‌న్‌కు చెందిన వ్యాపార‌వేత్త‌ను పెళ్లి చేసుకున్నారు. కొద్దిరోజుల కింద‌టే స్వ‌దేశానికి ఒంట‌రిగా తిరిగి వ‌చ్చారు. ఈ నెల 22వ తేదీన ఫ‌రీదాబాద్ జిల్లాలోని సూర‌జ్‌కుండ్‌లో ఉన్న తాజ్ వివాంటా హోట‌ల్‌లో దిగారు.

హోట‌ల్ గ‌దిలోకి వెళ్లిన స‌మ‌యంలో మూసిన త‌లుపులు ఇక తెర‌చుకోలేదు. ఈ విష‌యాన్ని చాలా..చాలా ఆల‌స్యంగా గుర్తించిన హోట‌ల్ సిబ్బంది.. త‌లుపులు ప‌గుల‌గొట్టి చూడ‌గా.. బాత్‌ట‌బ్‌లో మృత‌దేహ‌మై క‌నిపించారు. గ‌దిలో దిగ‌డానికి ముందే- హోట‌ల్ సిబ్బందికి ఆమె చేసిన కొన్ని సూచ‌న‌లు ఆమెది స‌హ‌జ మ‌ర‌ణం కాద‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి.

త‌న గ‌దికి ఎలాంటి స‌ర్వీస్ కోసం రావొద్ద‌ని, ఎలాంటి ఫోన్ కాల్స్‌నూ త‌న‌కు ఫార్వ‌ర్డ్ చేయొద్దని ఆమె సూచించిన‌ట్లు హోట‌ల్ సిబ్బంది పోలీసుల‌కు వెల్ల‌డించారు. ఈ ఘ‌ట‌న‌పై సూర‌జ్‌కుండ్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.  పోస్ట్‌మార్టమ్ నివేదిక త‌రువాత ఆమె మ‌ర‌ణానికి గ‌ల అస‌లు కార‌ణం తెలుస్తుంద‌ని చెబుతున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here